Iran Situation: ఇరాన్‌లో 544 మంది మృతి, 10,681 మంది అరెస్ట్.!

ఇరాన్‌లో గత 15 రోజులుగా అనేక ప్రావిన్సులలో ప్రభుత్వ వ్యతిరేక ర్యాలీలలో ప్రదర్శనకారులు వీధుల్లోకి రావడంతో కనీసం 544 మంది మరణించారు. 10,681 మందికి పైగా వ్యక్తులను అరెస్టు చేసి జైళ్లకు తరలించారు. తాజా డేటా ప్రకారం, దేశవ్యాప్తంగా 585 ప్రదేశాలలో నిరసనలు చెలరేగాయి, మొత్తం 31 ప్రావిన్సులలోని 186 నగరాల్లో విస్తరించాయి. 483 మంది నిరసనకారులు మరణించారు, వీరితో పాటు 47 మంది సైనికులున్నారు. మృతుల్లో ఐదుగురు సాధారణపౌరులు, ఎనిమిది మంది పిల్లలు మరణాలున్నాయి.

కాగా ఇరాన్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనకు దిగారు. దీంతో ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మహ్మద్ బాగర్ కలిబాఫ్ మాట్లాడుతూ.. అమెరికా దాడి చేస్తే అమెరికా సైనిక స్థావరాలను, ఇజ్రాయెల్‌ను తాము టార్గెట్‌గా భావిస్తామని చెప్పారు. పార్లమెంట్‌ ప్రత్యక్ష ప్రసారం సందర్భంగా ఎంపీలు అమెరికా ముర్దాబాద్ నినాదాలు చేస్తున్న సమయంలో ఆయన ఈ హెచ్చరిక చేశారు. అశాంతి సమయంలో దృఢంగా నిలబడినందుకు ఇరాన్ భద్రతా బలగాలను కలిబాఫ్ ప్రశంసించారు. అదే సమయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్లపైకి వచ్చిన నిరసన తెలుపుతున్న ఆందోళనకారులను సైతం ఆయన తీవ్రంగా హెచ్చరించారు.

Updated On 12 Jan 2026 7:34 AM GMT
ehatv

ehatv

Next Story