AP Liquor Scam : మద్యం కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..!
మద్యం కేసులో సుప్రీంకోర్టులో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వేసిన పిటిషన్‌పై విచారణ జరిగింది.

మద్యం కేసులో సుప్రీంకోర్టులో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వేసిన పిటిషన్‌పై విచారణ జరిగింది. ఈ సందర్భంగా సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. హైకోర్టులో బెయిల్ రద్దు పిటిషన్లు తేలేవరకు.. ఏసీబీ కోర్టు బెయిల్ పిటిషన్లు విచారించవద్దన్న ఏపీ హైకోర్టు తీర్పుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. బెయిల్ రద్దు, బెయిల్ పిటిషన్లను మెరిట్ ఆధారంగానే నిర్ణయించాలని స్పష్టం చేస్తూ.. ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ కేసుల్లో వ్యక్తిగత స్వేచ్ఛ ఇమిడి ఉంది. బెయిల్ కేసులకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి. ఎదురు చూడాలనే ఆదేశం ఏమాత్రం సరికాదు. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 21ని ఉల్లంఘించడమే. బెయిల్ రద్దు పిటిషన్లు గానీ, బెయిల్ పిటిషన్లు గానీ మెరిట్ ఆధారంగానే నిర్ణయించాలని జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ కె.వి విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.
