I Love Pakistan’ : ఐ లవ్ పాకిస్థాన్” అంటూ వీడియో తీసిన ఏపీ యువకుడు
శ్రీ సత్యసాయి జిల్లా నల్లచెరువు మండలం దేవిరెడ్డిపల్లికి చెందిన షేక్ మహమ్మద్ ఆసిఫ్ అనే యువకుడు ఐ లవ్ పాకిస్తాన్ అంటున్న వీడియో ఒకటి.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

శ్రీ సత్యసాయి జిల్లా నల్లచెరువు మండలం దేవిరెడ్డిపల్లికి చెందిన షేక్ మహమ్మద్ ఆసిఫ్ అనే యువకుడు ఐ లవ్ పాకిస్తాన్ అంటున్న వీడియో ఒకటి.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హిందూ మతానికి చెందిన ధనుంజయ్ బెంగళూరులో ముస్లిం యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అనంతరం మతం మార్చుకుని బెంగళూరులో నివాసముంటున్నాడు.ఐ లవ్ పాకిస్థాన్” అంటూ తీసిన వీడియో వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేశభక్తి భావాలను దెబ్బతీసేలా ఉందంటూ పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
సమాచారం ప్రకారం, ఆ యువకుడు తన వ్యక్తిగత అభిప్రాయంగా వీడియో తీసినట్లు తెలుస్తోంది. అయితే ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా పంచుకోవడంతో వివాదాస్పదంగా మారింది. కొందరు ఈ చర్యను ఖండిస్తుండగా, మరికొందరు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.ఈ ఘటనపై సంబంధిత అధికారులు అప్రమత్తమయ్యారు. వీడియో వెనుక ఉద్దేశం ఏమిటి?, ఎవరైనా ప్రేరేపించారా? అనే కోణంలో విచారణ చేపట్టినట్లు సమాచారం. ప్రస్తుతం యువకుడిని ప్రశ్నించి పూర్తి వివరాలు సేకరిస్తున్నట్లు అధికారులు తెలిపారు.


