వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో దర్యాప్తు పూర్తయిందని సుప్రీంకోర్టుకు సీబీఐ తెలిపింది.

వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో దర్యాప్తు పూర్తయిందని సుప్రీంకోర్టుకు సీబీఐ తెలిపింది. గత విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ‘ఈ కేసులో ఇంకా తదుపరి దర్యాప్తు అవసరమని సీబీఐ భావిస్తోందా.. రాష్ట్ర ప్రభుత్వం కడప సెషన్స్‌ కోర్టులో దాఖలు చేసిన క్లోజర్‌ రిపోర్టుపై సీబీఐ అభిప్రాయమేంటో చెప్పాలని.. కేసు ట్రయల్, తదుపరి దర్యాప్తు ఏక కాలంలో కొనసాగించే అవకాశం ఉందా..’అనే ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ఆదేశించింది. ఆగస్ట్ 5న మరోసారి జస్టిస్‌ ఎం.ఎం.సుందరేశ్, జస్టిస్‌ ఎన్‌.కోటీశ్వర్‌ సింగ్‌ లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. వివేకా హత్య కేసుకు సంబంధించి దర్యాప్తు పూర్తయిందని సుప్రీం కోర్టుకు సీబీఐ తెలిపింది. పిటిషనర్‌ తరఫున వాదనలేంటని ధర్మాసనం ప్రశ్నించగా.. సునీతారెడ్డి తరఫు సీనియర్‌ న్యాయవాది మరో కోర్టులో ఉన్నారని, వాదనలు వినిపించేందుకు తాము సిద్ధంగా ఉన్నందున పాస్‌ ఓవర్‌ ఇవ్వాలని మరో న్యాయవాది ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. మధ్యాహ్నం తర్వాత బెంచ్‌ కూర్చోవడం లేదు కాబట్టి మరో రోజు వాదనలు వింటామని ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈనెల 19వ తేదీకి వాయిదా వేసింది.

ehatv

ehatv

Next Story