Amaravathi: రాజధానికి భూములిచ్చింది.. తిట్టించుకోవడానికా అని రైతుల ఆవేదన..!

Farmers' grievances: Is it because they gave land to the capital to insult it?!

By :  ehatv
Update: 2025-11-18 04:31 GMT

గడిచిన ఐదేళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ హాయంలో మూడు రాజధానుల పేరుతో, జగన్మోహన్ రెడ్డి సర్కారు తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా అమరావతి ప్రాంతానికి సంబంధించిన రైతులు ఆందోళన చేస్తూ వచ్చారు. అమరావతి ప్రాంతంలో రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల ఆందోళనలకు రాజకీయ పార్టీలు అనేకమంది, ప్రజా సంఘాలు, మేధావులు కూడా మద్దతు ఇస్తూ వచ్చారు. ఓ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత, ప్రభుత్వాన్ని నమ్మి రైతులు భూములు ఇచ్చిన తర్వాత, ప్రభుత్వం ఏ రకంగా చీటింగ్ చేస్తుంది, మూడు రాజధానుల పేరుతో ఈ ప్రాంతంలో భూములు ఇచ్చిన రైతులని చీటింగ్ చేయడం ఏంటి అంటూ వాళ్ళ ఆందోళన తెలపడం, ఒకే రాజధాని ఉండాలి, అది అమరావతిగానే ఉండాలి, ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి, ప్రభుత్వం ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని మాకు ఇచ్చిన హామీని నిలబెట్టాలి అనేది, అక్కడ రైతులు చేసిన డిమాండ్. రైతుల డిమాండ్ మేరకు ఆ రైతులు కోరుకున్న ప్రభుత్వం, కూటమి సర్కారు ఒకే రాజధాని ఉంచుతాం, మూడు రాజధానులు మా విధానం కాదు, ఒకే రాజధాని అమరావతిని అభివృద్ధి చేస్తాం అంటూ చెప్పిన నేపథ్యంలో, అమరావతిని అభివృద్ధి చేస్తామని చెప్పిన కూటమికి అక్కడ రైతులు జేఏసీలు మద్దతు ఇస్తూ వచ్చాయి. ఈ నేపథ్యంలో అమరావతి ఒకటే రాజధాని, దాని అభివృద్ధి మా లక్ష్యం అని చెప్పి, అధికారంలోకి వచ్చిన కూటమి సర్కారు, మా సమస్యలని పరిష్కారం చేయట్లేదు అంటూ, ఆ రోజు ఆందోళన చేసిన ఆందోళనకారులు, ఇప్పుడు మళ్ళీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూటమి సర్కారు అమరావతి ప్రాంతానికి సంబంధించి, ఇప్పటికే 60 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని చెప్పింది, ఇంకొన్ని అప్పులతో కలిపి 90 వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకురాబోతున్నామని చెప్పింది.

32 వేల కోట్ల రూపాయలకు పైగా పనులు ప్రారంభమయ్యాయి అని చెప్తుంది. అమరావతిలో వేగంగా అభివృద్ధి పనులు చేస్తున్నామని చెప్తుంది.

కానీ అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులు బయటకు పెద్దగా కనిపించట్లేదు, ఏం జరుగుతోంది, అసలు అవుతుందా లేదా అనే ఆందోళన ఆ ప్రాంతంలో, ఆ అమరావతి కోసం ఉద్యమాలు చేసిన రైతుల్లోనూ కనబడుతుంది. ఉద్యమాలు చేసిన నాయకుల్లో కనబడుతుంది. పైగా అదనపు భూసేకరణ పేరుతో, ఈ రైతుల్లో మరొక టెన్షన్‌ని, కూడా ఈ ప్రభుత్వం తీసుకొచ్చి పెట్టింది. ఇప్పుడు మనం ఇచ్చిన భూములు 33,000 ఎకరాల భూములు, ఇంతవరకు అభివృద్ధి కాలేదు, 10 ఏళ్ళ అవుతుంది, కొత్తగా మళ్ళీ అదనపు భూసేకరణ అంటున్నారు, అదనపు భూసేకరణ చేస్తూ పోతే మన పరిస్థితి ఏంటి, మన భూముల పరిస్థితి ఏంటి, మన భూములు ఎప్పుడు అభివృద్ధి చేస్తారు, అవి ఇప్పుడు కొత్తగా తీసుకునే భూములు, ఇవి కలిపి అభివృద్ధి చేయాలంటే ఎప్పటికీ అయ్యే పని అనే ఆందోళన కూడా ఆ ప్రాంతానికి సంబంధించిన రైతుల్లో కనపడుతుంది. రైతుల ఆందోళనపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' ఎనాలసిస్..!Full View

Tags:    

Similar News