ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది దాటిన తరుణంలో, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వానికి ఓ సర్వే రూపంలో ఊహించని షాక్ తగిలింది.

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది దాటిన తరుణంలో, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వానికి ఓ సర్వే రూపంలో ఊహించని షాక్ తగిలింది. హైదరాబాద్‌ ప్రధాన కేంద్రంగా పనిచేసే ఐఐటియన్ల బృందం 'మూడ్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్' పేరిట నిర్వహించినట్లుగా చెప్తున్న ఈ సర్వే, రాష్ట్ర రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ నివేదిక ప్రకారం కూటమికి చెందిన మెజారిటీ ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత భారీగా పెరిగినట్లు తెలుస్తోంది.

ఈ సర్వేను హైదరాబాద్‌లో స్థిరపడిన ప్రఖ్యాత సెఫాలజిస్ట్ నేతృత్వంలోని ఐఐటీయన్ గ్రూప్ నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్‌లోని 172 అసెంబ్లీ నియోజకవర్గాలలో సమగ్ర క్షేత్ర సర్వే నిర్వహించబడింది, అసెంబ్లీ నియోజకవర్గానికి సగటున 425 నమూనాలను సేకరించారు. జనాభాలోని విభిన్న విభాగాలలో సమతుల్య ప్రాతినిధ్యాన్ని నిర్ధారించడానికి స్ట్రాటిఫైడ్ (సెలెక్టివ్), యాదృచ్ఛిక నమూనా పద్ధతులతో కలిపి నమూనా పద్ధతి. ఈ సర్వే ఆంధ్రప్రదేశ్‌లోని 4 మండలాలను (ఉత్తరాంధ్ర (జోన్ 1), రాయలసీమ (జోన్ 2), తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణ, గుంటూరు (జోన్ 3), నెల్లూరు & ప్రకాశం జిల్లాలు (జోన్ 4)) కవర్ చేసే సామాజిక-ఆర్థిక మరియు రాజకీయ జనాభాను సంగ్రహించడానికి సూక్ష్మంగా రూపొందించబడింది.

ప్రతి దశలో నమూనాలను రెండు విధాలుగా తీసుకుంటారు, అంటే యాదృచ్ఛిక, ఎంపిక చేసిన నమూనాలు వరుసగా 48%: 52% నిష్పత్తిలో తీసుకున్నారు.

1. రైతులు మరియు కౌలు రైతులు (వరి, చెరకు, పొగాకు, పత్తి, మిర్చి (లేదా) మిరప, కూరగాయలు, మామిడి, ఆక్వా వ్యవసాయం మొదలైనవి పండించడం).

2. నిరుద్యోగ యువత.

3. కళాశాల మరియు విశ్వవిద్యాలయ విద్యార్థులు.

4. ప్రభుత్వ ఉద్యోగులు మరియు పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులు.

5. ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నారు.

6. RTC ఉద్యోగులు & ఆటో డ్రైవర్లు.

7. ఆసా, అంగన్‌వాడీ కార్మికులు.

8. DWCRA మహిళలు.

9. OC సంఘం.

10. బిసి కమ్యూనిటీ (అన్ని ఉప కులాలతో సహా)

11. ఎస్సీ (మాల)

12. ఎస్సీ (మాదిగ)

13. ఎస్టీ కమ్యూనిటీ.

14. 18 – 30 సంవత్సరాల మధ్య వయస్సు గల అన్ని వయసుల వారు (పురుషులు మరియు స్త్రీలు ఇద్దరూ). 31 – 45 సంవత్సరాలు, 46 – 55 సంవత్సరాలు, 56 – 60 సంవత్సరాలు మరియు 60 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు గలవారు.

15. చిన్న మరియు మధ్యతరగతి వ్యాపార వ్యక్తులు.

16. చాలా పేదలు, పేదలు, మధ్యతరగతి, ధనవంతులు.

17. వేతనదారులు.

18. గ్రామ పంచాయతీ సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్‌పీటీసీలు వంటి స్థానిక సంస్థల నాయకులు.

19. క్షేత్ర స్థాయిలో పార్టీ క్యాడర్ (పార్టీతో సంబంధం లేకుండా).

2024 ఎన్నికల్లో 135 స్థానాలు గెలుచుకున్న టీడీపీకి ఈ సర్వే మింగుడు పడని నిజాలను ముందుంచింది. ఏకంగా 54 మంది టీడీపీ ఎమ్మెల్యేలపై తీవ్ర ప్రజా వ్యతిరేకత (యాంటీ-ఇన్‌కంబెన్సీ) ఉందని తేలింది. దీనికి అదనంగా మరో 22 మంది ఎమ్మెల్యేల పనితీరు పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని సర్వే వెల్లడించింది.

జనసేన పార్టీ: సంపూర్ణ విజయాన్ని నమోదు చేసిన జనసేనకు కూడా ఈ సర్వే హెచ్చరికలు జారీ చేసింది. పార్టీకి చెందిన 21 మంది ఎమ్మెల్యేలలో 14 మంది ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారని సర్వే పేర్కొంది. మరో ముగ్గురు ఎమ్మెల్యేలపై వ్యక్తిగతంగా ప్రజల్లో వ్యతిరేకత ఉన్నట్లు తేలింది.

భారతీయ జనతా పార్టీఫ కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీకి సైతం ఈ సర్వే ఫలితాలు షాక్‌ ఇచ్చాయి. ఎనిమిది మంది బీజేపీ ఎమ్మెల్యేలలో నలుగురిపై ప్రభుత్వ వ్యతిరేకత ఉండగా, ఒక ఎమ్మెల్యేపై వ్యక్తిగత వ్యతిరేకత ఉన్నట్లు నివేదికలో వెల్లడైంది.

ఈ సర్వే నివేదిక వెలువడిన నాటి నుంచి, ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఏడాది కాలంలోనే ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో ఇంత వ్యతిరేకత రావడంపై వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ఈ సర్వే నివేదికను సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తూ, కూటమి ప్రభుత్వంపై విమర్శల దాడిని తీవ్రతరం చేశారు. ఈ సర్వే ఫలితాలు రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎలాంటి మార్పులకు దారితీస్తాయోనని రాజకీయ విశ్లేషకులు ఆసక్తిగా గమనిస్తున్నారు



Updated On 16 July 2025 8:39 AM GMT
ehatv

ehatv

Next Story