అక్రమ అరెస్టులు: వెంకట్ రెడ్డి రిమాండ్ తిరస్కరణ..!

Illegal arrests: Venkat Reddy's remand rejected..!

By :  ehatv
Update: 2025-11-19 06:40 GMT

Full Viewఆంధ్రప్రదేష్‌లో అక్రమ అరెస్టులకు సంబంధించిన వ్యవహారం పైన చర్చ చూస్తున్నాం. అవి అక్రమ అరెస్టులని ప్రతిపక్ష పార్టీ అంటుంది. ఇవి చట్ట ప్రకారం జరిగిన అరెస్టులే అంటూ అధికార పార్టీ మాట్లాడుతుంది. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం, చట్టం తన పని తాను చేసుకుపోతుంది ఇలాంటి గంభీరమైన స్టేట్మెంట్లు కూడా ప్రభుత్వం వైపు నుంచి చూస్తున్నాం. నిన్న ఉదయం వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకట్ రెడ్డిని తాడిపత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. తాడిపత్రి పోలీసులు అరెస్ట్ చేసి, ఆయనను తాడిపత్రి తీసుకెళ్ళారు. అక్కడ మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారు. డిఎస్పి ఒక రెండు గంటల పాటు ఆయన విచారణ చేశారు, మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన తర్వాత ఆయన రిమాండ్ ని తిరస్కరించారు. రిమాండ్‌ని తిరస్కరించడంతో వెంకట్ రెడ్డి రిలీజ్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ పోలీసుల వ్యవహార శైలి పైన, హైకోర్ట్ ఇప్పటికే అనేక సందర్భాల్లో అక్షింతలు, మొట్టికాయలు, చెంపదెబ్బలు కొట్టింది. కానీ ఆంధ్రప్రదేశ్ పోలీసులకు ఎందుకు ఇవేవి కనపడట్లేదు, అవేవి కూడా ఆంధ్రప్రదేశ్ పోలీసుల ఆలోచన ధోరణని మార్చట్లేదు, ప్రశ్నించటం ప్రజల హక్కు, ప్రశ్నించడం ప్రజల భావ ప్రకటన హక్కు, ప్రజల భావ ప్రకటన హక్కుని భంగం కలిగించే హక్కు పోలీసులకు ఉండదు, పోలీసులు చట్ట ప్రకారం వ్యవహరించాలి, సేమ్ టైం పౌరుడికి కూడా కొన్ని హక్కులు ఉంటాయి. పౌరుడు హక్కులు దాటి సమాజంలో అన్రెస్ట్ క్రియేట్ అయ్యేలా, ఎవరైనా వ్యక్తుల్ని టార్గెట్ చేసేలా, చట్టానికి విఘాతం కలిగించేలా ఏమన్నా మాట్లాడితే పోలీసులు చర్యలు తీసుకోవచ్చు. చర్యలు తీసుకునే క్రమంలో అలా ఎవరు మాట్లాడినా చర్యలు తీసుకోవాలి. అధికారంలో ఉన్న పార్టీ, అధికారంలో ఉన్న పార్టీకి సంబంధించిన మీడియా, అధికారంలో ఉన్న పార్టీకి సంబంధించిన నాయకులు, కోర్టుకి సంబంధించిన విషయాల్లో నాయకులు ఏమైనా మాట్లాడతాం, ఏమైనా రాస్తాం, మేము ఏమైనా చేయొచ్చు, కానీ ప్రతిపక్షానికి సంబంధించిన వాళ్ళు, ప్రజల తరపున మాట్లాడే వాళ్ళు మాత్రం, ఏం మాట్లాడాలో మేమే డిక్టేట్ చేద్దాం అన్నట్టుగా పోలీసు వ్యవహరిస్తే ఖచ్చితంగా సరైనది కాదు. సరైనది కాదు అనే విషయాన్ని నిన్న మెజిస్ట్రేట్ కూడా చెప్పారు. సతీష్ అనే పోలీస్ అధికారి హత్య విషయంలో సారీ అది హత్య, ఆత్మహత్య తెలీదు, అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ అంశానికి సంబంధించి వెంకట్ రెడ్డి అన్రెస్ట్ క్రియేట్ అయ్యేలా వార్తలు, అన్రెస్ట్ క్రియేట్ అయ్యేలా మాట్లాడారు అన్నది పోలీసుల అభియోగం. ఆయన అన్రెస్ట్ క్రియేట్ అయ్యేలా మాట్లాడారని ఎవరో ఒక వ్యక్తి తెలుగుదేశం పార్టీ, కార్యకర్తగా చెప్తున్నారు, ఆయన కంప్లైంట్ ఇస్తే పోలీసులు హుటాహుటిన రాత్రి కంప్లైంట్స్ ఇస్తే తాడిపత్రిలో, తెల్లారేసరికి హైదరాబాద్ కి వచ్చి ఆయన ఇల్లు ఎక్కడో కనుక్కొని, ఆయన్ని ట్రేస్ చేసి తీసుకెళ్ళిపోయారు. పోలీసుల వైఖరిపై కోర్టు ఏం చేప్పిందంటే సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణలో..

Tags:    

Similar News