సూపర్‌ సిక్స్‌ అంటూ ఎన్నో ఎన్నికల హామీలు ఇచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.

సూపర్‌ సిక్స్‌ అంటూ ఎన్నో ఎన్నికల హామీలు ఇచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. సూపర్‌ సిక్స్ అమలుపై ప్రజల్లో కూడా అసహనం నెలకొంది. అన్నదాత సుఖీభవ పథకంపై టీడీపీ మాజీ నేత, పాలకొండ జనసేన ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ అసంతృప్తి వ్యాఖ్యలు చేశారు. గత వైఎస్సార్‌సీపీ హయాంలో రైతు భరోసా అందిన రైతులకు.. ఇప్పుడు అన్నదాత సుఖీభవ జమ కావడం లేదని అంటున్నారు. ఈ క్రమంలో.. వండవ గ్రామంలో 600 మంది రైతులకు నగదు జమ కాకపోవడాన్ని ప్రమఖంగా ప్రస్తావించారు. ‘‘అన్నదాత సుఖీభవపై అధికారులకు ఫిర్యాదు చేశాం. పరిష్కరిస్తారేమో చూడాలి. న్యాయం జరగకపోతే సీఎం దృష్టికి, వ్యవసాయ శాఖ మంత్రి దృష్టికి తీసుకు వెళ్తా. వాళ్లకు న్యాయం జరిగే దాకా పోరాడతా’’ అని నిమ్మక అన్నారు. ఏడాదిన్నర దాటినా కూటమి పాలనలో సంక్షేమం ఊసే లేకుండా పోయింది'' అని ఆయన వాపోయారు.

Updated On
ehatv

ehatv

Next Story