Tragedy in Palnadu : రెండు కుటుంబాల్లో రూ.50 వేల అప్పు చిచ్చు.. ఇద్దరు మృతి.. మరో ఇద్దరి పరిస్థితి విషమం
పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం పణిదం గ్రామంలో దాసరి వెంకటేశ్వర్లు అనే వ్యక్తికి ఏడాది క్రితం రూ.50 వేలు అప్పుగా శ్రీనివాసరావు ఇచ్చాడు.

పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం పణిదం గ్రామంలో దాసరి వెంకటేశ్వర్లు అనే వ్యక్తికి ఏడాది క్రితం రూ.50 వేలు అప్పుగా శ్రీనివాసరావు ఇచ్చాడు.
అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి అడగడానికి వెంకటేశ్వర్లు ఇంటికి వెళ్లిన శ్రీనివాసరావు భార్య పూర్ణకుమారి, కుమారుడు వెంకటేశ్. ఈ విషయంలో వీరి మధ్య గొడవ జరిగి, తాను ఆత్మహత్య చేసుకుని మీపై కేసు పెడతానంటూ వారి ముందే పురుగుల మందు తాగిన వెంకటేశ్వర్లు. కుటుంబసభ్యులు సత్తెనపల్లిలోని ఆసుపత్రికి తరలించగా విషమించిన వెంకటేశ్వర్లు ఆరోగ్యం, దీంతో భయాందోళనకు గురై, అనవసరంగా అప్పు ఇచ్చి లేని గొడవలు తలపై వేసావని శ్రీనివాసరావుతో గొడవపడ్డ భార్య పూర్ణకుమారి. నన్నే తప్పు పడుతున్నారా, అయితే చచ్చిపోతా, మీరుండండి అంటూ పొలం నుండి ఇంటికి వెళ్ళి పురుగుల మందు తాగిన శ్రీనివాసరావు. ఈ విషయం తెలుసుకొని తీవ్ర ఆందోళనకు గురై పొలం వద్ద ఉన్న బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న శ్రీనివాసులు భార్య పూర్ణకుమారి (40), కుమారుడు వెంకటేశ్ (25), మరోవైపు అప్పు ఇచ్చిన శ్రీనివాసరావు, అప్పు తీసుకున్న వెంకటేశ్వర్లు ఇద్దరి పరిస్థితి విషమం
