Lockup Death : ప్రకాశం జిల్లాలో లాకప్ డెత్..?
పోలీసు టార్చర్‌తో వ్యక్తి మృతి.. గోప్యంగా ఉంచుతున్న పోలీసులు, విషయం బయటకు చెప్పొద్దని బాధిత కుటుంబానికి బెదిరింపు వారినెవరూ కలువకుండా ఇంటి వద్ద నిఘా.

పోలీసు టార్చర్‌తో వ్యక్తి మృతి.. గోప్యంగా ఉంచుతున్న పోలీసులు, విషయం బయటకు చెప్పొద్దని బాధిత కుటుంబానికి బెదిరింపు వారినెవరూ కలువకుండా ఇంటి వద్ద నిఘా.. గుట్టుచప్పుడు కాకుండా అంత్యక్రియలు చేశారు. ప్రకాశం జిల్లాలో టీడీపీ(TDP) నేత, మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరిని(Veerayya Chowdary) ఏప్రిల్లో హత్య చేసిన ప్రత్యర్థులు. రియల్ ఎస్టేట్, మద్యం సిండికేట్ విభేదాలే కారణమని ప్రాథమికంగా నిర్ధారించిన పోలీసులు. టీడీపీలోని వీరయ్య చౌదరి వైరి వర్గం వారే ఈ హత్యకు పాల్పడ్డారని కూడా గుర్తించినట్టు సమాచారం. ఈ కేసు దర్యాప్తులో భాగంగా పలువురు అనుమానితులను కొన్ని రోజులుగా అదుపులోకి తీసుకుని విచారిస్తున్న ప్రకాశం జిల్లా పోలీసులు. ఈ కేసును త్వరగా ఛేదించాలని ప్రభుత్వ పెద్దల నుంచి ఒత్తిడి రావడంతో ఎలాగైనా దోషులను గుర్తించి త్వరగా కేసు క్లోజ్ చేయాలని పంతం పట్టిన ప్రకాశం జిల్లా పోలీసు ఉన్నతాధికారి. ఆ మేరకు అనుమానితులుగా భావిస్తున్న వారిని పెద్ద సంఖ్యలో అదుపులోకి తీసుకుని తీవ్రంగా కొడుతూ నేరాన్ని ఒప్పుకోవాల్సిందిగా వేధించిన పోలీసులు. ఇటీవల కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లో కాకుండా ఒంగోలులోని పోలీసు శాఖకు చెందిన శిక్షణ కార్యాలయం ప్రాంగణంలో రహస్యంగా ఉంచి విచారించినట్టు సమాచారం. కొన్ని రోజులుగా అనుమానితులను అక్రమంగా నిర్బంధించి విచారణ పేరిట పోలీసులు తమదైన శైలిలో విచారించగా.. పోలీసు దెబ్బలకు తీవ్రంగా గాయపడిన ఓ అనుమానితుడు మృతి చెందారని బంధువులు ఆరోపిస్తున్నారు.
