✕
Love affair:ప్రేమ వ్యవహారం.. 'లా' చదువుతున్న యువతి ఆత్మహత్య..!
By ehatvPublished on 21 Jan 2026 6:37 AM GMT
ప్రేమ వ్యవహారం.. 'లా' చదువుతున్న యువతి ఆత్మహత్య..!

x
అనంతపురం జిల్లా విషాదం చోటు చేసుకుంది. రాప్తాడు మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన మల్లికార్జున కుమార్తె భవాని (19) ఆత్మహత్య చేసుకుంది. అనంతపురంలోని అశోక్‌నగర్‌లో ఉన్న ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ నగరంలోని విజయనగర లా కళాశాలలో ఎల్ఎల్బి ద్వితీయ సంవత్సరం చదువుతోంది. మంగళవారం సాయంత్రం తన గదిలో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని భవాని ఆత్మహత్య చేసుకుంది. తోటి విద్యార్థినులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడకు చేరుకుని పోలీసులు గది తలుపులు తీసి పరిశీలించగా అప్పటికే మరణించినట్లు గుర్తించారు. భవాని మృతదేహాన్ని జీజీహెచ్‌లోని మార్చురీకి తరలించారు. ప్రేమ వ్యవహారమే ఆత్మహత్యకు కారణంగా పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఘటనపై విచారణ జరుపుతున్నట్లు అనంతపురం వన్‌టౌన్ పోలీసులు వెల్లడించారు.

ehatv
Next Story

