కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ వ్యక్తి స్నేహితుడి కూతురుపై కన్నేశాడు. తన స్నేహితుడే తన కూతురును బలాత్కరించి, ఆమెను గర్భవతి చేసిన విషం తెలుసుకొని బాధితురాలి తండ్రి తీవ్ర ఆవేదన చెందాడు.

కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ వ్యక్తి స్నేహితుడి కూతురుపై కన్నేశాడు. తన స్నేహితుడే తన కూతురును బలాత్కరించి, ఆమెను గర్భవతి చేసిన విషం తెలుసుకొని బాధితురాలి తండ్రి తీవ్ర ఆవేదన చెందాడు. విషయం బయటకు చెబితే చంపేస్తానని బాలికను బెదిరించాడు. ఈ క్రమంలో బాలిక గర్భం దాల్చడంతో ఆదివారం విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. నెల్లూరు జిల్లా సంతపేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఓ వ్యక్తి తన భార్య, పదిహేడేళ్ల కూతురుతో కలిసి నివాసం ఉంటున్నాడు. అతనికి వారధి సెంటర్‌కు చెందిన కుమార్‌ అనే స్నేహితుడు ఉన్నాడు. ఇరు కుటుంబాలు సన్నిహితంగా ఉంటున్నాయి. అందరూ కలిసి బయటకు వెళ్లేవారు. ఈ ఏడాది మార్చిలో ఇరు కుటుంబాలు తిరుమలకు వెళ్లాయి. తిరుగు ప్రయాణంలో కుమార్‌ అతని భార్య, స్నేహితుడి కుమార్తె శ్రీకాళహస్తికి వెళ్లారు. అక్కడే ఉండి మార్చి 16న నెల్లూరుకు వచ్చారు. బాలిక కుమార్‌ ఇంట్లో ఉండగా, అతని భార్య వ్యాపార నిమిత్తం బయటకు వెళ్లింది. ఎవరూ లేని సమయాన్ని అదునుగా భావించిన కుమార్.. బాలికను బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం ఇంట్లో చెబితే చంపేస్తామని బెదిరించాడు. దీంతో బెదిరిపోయిన ఆమె ఎవరికి చెప్పలేదు. రెండు నెలలుగా బాలికకు పీరియడ్స్‌ రాకపోవడంతో బాధిత తల్లి ఆమెను శనివారం జీజీహెచ్‌కు తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు బాలిక గర్భవతి అని నిర్ధారించారు. దీంతో బాలికను తల్లిదండ్రులు ప్రశ్నించగా జరిగిన విషయాన్ని చెప్పింది. బాధితురాలు ఆదివారం సంతపేట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇన్‌స్పెక్టర్‌ జి. దశరథరామారావు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ehatv

ehatv

Next Story