Jana Sena leader Bolisetty's sensation..! కూటమిలో కొత్త మంట..! జనసేన క్యాడర్లో తీవ్ర అసంతృప్తి..! జనసేన నేత బొలిశెట్టి సంచలనం..!
Jana Sena leader Bolisetty's sensation..! కూటమిలో కొత్త మంట..! జనసేన క్యాడర్లో తీవ్ర అసంతృప్తి..! జనసేన నేత బొలిశెట్టి సంచలనం..!

ఇప్పుడు కుటమి స్ఫూర్తి గురించి, కుటమి స్ఫూర్తికి విఘాతం కలిగే పరిస్థితి గురించి నేను కాస్త బహిరంగంగానే చర్చించాలనుకున్నా. ఎందుకంటే ఇది నార్మల్గా అంతర్గతంగా చర్చించాల్సిన విషయం అయినప్పటికీ, ఎందుకంటే అధినాయకత్వానికి క్షేత్ర స్థాయిలో జరుగుతున్న విషయాలు, అటు చంద్రబాబు నాయుడు గారికి గాని, ఇటు ఆ పవన్ కళ్యాణ్ గారికి గాని, లేదంటే బిజెపి మాధవ్ గారికి గాని కొన్ని విషయాలు క్షేత్ర స్థాయిలో జరుగుతున్నవి, నా ద్వారా నేను వారికి తెలియజేస్తున్నాను. మొట్టమొదటిది 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారి దూరదృష్టి, వ్యూహం వల్ల ఆయన రాజమండ్రి జైలుకి వెళ్ళడం, చంద్రబాబు నాయుడు గారికి మద్దతు పలకడం, బయటకు రావడం, కలిసి పోటీ చేస్తాను అనడం, అలాగే బిజేపీని కూడా కలుపుకొని వెళ్ళడం, ఇవన్నీ చేసిన తర్వాత ఓట్లు చీలకుండా అనూహ్యమైన విజయాన్ని ఎవరు ఊహించలేదు, 151 చాలా ఎక్కువ అనుకుంటే, 164 సీట్లు అవి కూడా, ఆ 11 సీట్లు కూడా కొన్ని కొన్ని పొరపాట్లు వల్ల పోయినాయి తప్ప, లేకుంటే 175కు 175 సీట్లు వచ్చే పరిస్థితి. ఆ పరిస్థితికి కారణం పవన్ కళ్యాణ్ గారి చొరవ, చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి, అలాగే మోడీ గారి నాయకత్వం అన్ని కలిసి వచ్చాయి. అయితే అది, ఈ రానున్న స్థానిక ఎన్నికల్లో గాని లేకపోతే, 2029 అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో గాని మళ్ళీ రిపీట్ అవ్వాలంటే, మనం అనుకున్న ఒప్పందం, జాయింట్ అగ్రీమెంట్ హస్ టు బి ఇంప్లిమెంటడ్ అట్ ద గ్రాస్ రూట్ లెవెల్, క్షేత్ర స్థాయిలో మనం అనుకున్నవి అమలు జరగాలి. ఏమనుకున్నాం మనం టిడిపి పోటీ చేసే స్థానాల్లో జనసేనకి 30%, బిజెపీకి 10%, అలాగే జనసేన పోటీ చేసిన స్థానాల్లో జనసేనకి 60%, బిజెపీకి 30%, టిడిపికి 10%, అలాగే బిజెపీ పోటీ చేసిన స్థానాల్లో బిజెపీకి 60%, టిడిపికి 30%, అలాగే మొత్తం అందరికీ ఈ వాటా ఎవరైతే అధికారంలో ఉన్నారో వారికి 60% ఉంది. అక్కడ ఎమ్మెల్యే అధికారం లేని దగ్గర కూడా కార్యకర్తలు బలపడాలంటే, వాళ్ళకి ఎంతో కొంత పవర్ కావాలని ఉద్దేశంతో 30% జనసేనకి, 10% బిజెపీకి ఇవ్వాలని తీర్మానించుకున్నాం. ఇది క్షేత్ర స్థాయిలో అమలవుతున్నట్టు కూడా కనబడుతుంది, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పదవీ బాధ్యత అని పెట్టినప్పుడు కూడా 3,400 మందికి పోస్టులు వచ్చాయంటే మాకు ఆశ్చర్యం వేసింది. ఇంతమందికి వచ్చినాయా అని, నిజంగా సంతోషం వస్తే, కానీ అందులో ఎంతమంది జనసేన నాయకులు, జనసైనికులు ఉన్నారు, ఎంతమంది వీర మహిళలు ఉన్నారు అనేది కూడా చూడాలి, ఎందుకంటే అందులో పొరపాట్లు జరిగాయి అన్నది ఒక రకమైన వాస్తవం, చాలామంది పదవులు ఇచ్చేసారు, ఇచ్చేసిన వాళ్ళ పేర్లు జనసేన పెట్టారు తప్ప, వాళ్ళ జనసేన పార్టీ గురించి ఎప్పుడు పని చేసిన వాళ్ళు కాదు. సో ఇటువంటి పరిస్థితుల్లో అగ్రస్థాయిలో చంద్రబాబు నాయుడు గారు గాని, పవన్ కళ్యాణ్ గారు గాని, అందరూ మంచి నిర్ణయాలు తీసుకున్న క్షేత్ర స్థాయిలో అమలు పోవడం వల్ల నష్టం జరుగుతుంది. ఇది నేను చంద్రబాబు నాయుడు గారికి తెలిసే జరుగుతుంది, లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి తెలిసే జరుగుతుందని నేను అనను. ఎందుకంటే క్షేత్ర స్థాయిలో ఆ తప్పులు జరుగుతున్నాయి, రాష్ట్రం అంతా, నేను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అవ్వడం వల్ల, ప్రతి జిల్లా నుంచి ప్రతి నియోజక వర్గం నుంచి, నాకు ఫోన్లు వస్తున్నాయి. ఇక్కడ ఈ ఫలానా కమిటీ చేశారు, అందులో మన జనసేనకి స్థానం లేదు, ఇక్కడ ఫలానా మార్కెట్ యార్డ్ ఇచ్చారు అందులో జనసైనికులకు స్థానం లేదు ఇలా చాలా చెప్తున్నారు. నేను అందుకంటే అది అధిష్టానం చూసుకుంటది అన్న దృష్టి వదిలేసాను. అయితే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయిన నేను, నేను నివసిస్తున్న నియోజక వర్గం, ఈస్ట్ విశాఖపట్నం, ఈస్ట్ లో పాయింట్ ఆఫ్ కాంట్రాక్ట్ గా కూడా ఉన్నా, ఒక నియోజక వర్గ స్థాయి నాయకుడిగా కూడా ఉన్నా, ఇక్కడ ఒక ఐదు దేవాలయాలు ఉన్నాయి, విశాఖపట్నం ఈస్ట్ లో ఐదు దేవాలయాలకి కమిటీలు వేశారు, ఎందులోనూ జనసేనకు చోటు లేదు. ఇంతకంటే అవమానం ఇంకోటి ఉంటాదని నేను అనుకోవడంలే, నేను ఇప్పుడు రామకృష్ణ బాబు గారితో మాట్లాడాను, అలాగే ఇక్కడ చోడే పట్టాభి గారితో కూడా మాట్లాడాను, ఏంటి ఈ అన్యాయం ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, సార్ మేము అధిష్టానానికి పంపించాం, అధిష్టానం ఇవే పంపించింది అన్నారు, అంటే డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారే డిసైడ్ చేశారు, లేదా లోకేష్ బాబు గారు డిసైడ్ చేశారు అన్నట్టు చెప్తున్నారు. నిజంగా అది జరిగిందా అంటే నేను జరుగుతదని నేను అనుకోను, ఎందుకంటే వాళ్ళద్దరికీ పవన్ కళ్యాణ్ గారు అంటే అభిమానం ఉంది, వాళ్ళద్దరికీ క్షేత్ర స్థాయిలో అన్ని పార్టీలు కలిసి వెళ్ళాలని ఉంది, అయితే మరి నిన్న కరక చెట్టు పాలమంబ ఎవరైతే మత్యకారి దేవత, మత్యకారులు అందరూ కూడా ఉత్తరాంధ్రలో, ఉన్న మత్యకారులు అందరూ కూడా, కరకచెట్టు పాలమమ్మ అంటే అత్యంత పవిత్రమైన గుడి, అత్యంత ప్రభావవంతమైన గుడి, ఆ దేవాలయానికి కమిటీలు నిన్న ప్రమాణ స్వీకారం చేసింది. నిన్న ప్రమాణ స్వీకారం చేసిన 11 మంది సభ్యుల్లో, 10 మంది టిడిపి, ఒక్కరు, బిజెపి, జనసేన సున్నా. నేను ఎమ్మెల్యే గారిని అడిగా, ఏంటి అంటే లేదండి ఇవ్వాలంటే, మీకు తప్పు జరిగింది, తప్పు జరగడం ఏంటి, 30% అడిగారు మూడు సీట్లు ఇవ్వాలి కదా, మూడు కాకపోతే రెండు ఇవ్వాలి, రెండు కాపోతే ఒకటి ఇవ్వాలి, ఒకటి కూడా లేకుండా సున్నా అన్నది కరెక్ట్ కాదండి, ఇది నేను పైకి తీసుకెళ్తున్నాను అని కూడా చెప్పాను. వాళ్ళు చాలా మర్యాదగానే చెప్పారు, కానీ ఇదే పరిస్థితి ప్రతి చోట కొనసాగుతుంది అన్నది నాకు ఒక అనుమానం వచ్చి ఈ వీడియో పెడుతున్నాను. ఎక్కడైనా సరే క్షేత్ర స్థాయిలో జనసేనకి రావలసిన 30% రాకపోతే, డెఫినెట్ గా మీరు అక్కడ స్థానిక నాయకులను నిలదీయండి, అలాగే అధిష్టానానికి తెలియజేయండి, ఎందుకంటే అప్పుడే మనకి 2029లో గాని, లేకపోతే ఇప్పుడు రానున్న లోకల్ బాడీ ఎన్నికల్లో గాని, మనకి సముచితమైన రిజల్ట్స్ వస్తాయి. లేదంటే చచ్చింది అనుకున్న ఆ జగన్ పార్టీ మళ్ళీ బలపడుతుంది, మళ్ళీ రోడ్డు మీద ఎక్కుతుంది. కాబట్టి నేను చంద్రబాబు నాయుడు గారి,కి పవన్ కళ్యాణ్ గారికి ఈ విషయంలో జోక్యం చేసుకొని నియోజకవర్గ స్థాయిలో ఎవరికి ఎన్ని ఇచ్చారు, రాష్ట్ర స్థాయిలో 5000 వచ్చినాయి, 3000 వచ్చినాయి కాదండి, నియోజకవర్గ స్థాయిలో జనసేనకి ఎన్ని ఇచ్చారు, బిజెపికి ఎన్ని ఇచ్చారు, టిడిపి ఎన్ని తీసుకుంది, అన్నది ప్రతి టెంపుల్ పైన కూడా, ప్రతి టెంపుల్ కమిటీలో గాని, మార్కెట్ కమిటీలో గాని, ఎక్కడైనా సరే అవి కనపడాలి, పారదర్శకత ఉండాలి, పారదర్శకత ఉంటే అంటే ఫ్యూచర్ అంతా మనదే, 2029 కాదు తర్వాత 2034 ఎలక్షన్స్ కూడా మనమే గెలుస్తాం.


