JanaSena MLA: మహిళతో రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే రాసలీలలు.. వాట్సాప్‌లో నగ్న వీడియోలు..!

జనసేన నేతల కీచక పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు మహిళల్ని వేధింపులు గురి చేసిన ఉదంతాలు వెలుగులోకి వచ్చినా వారి ప్రవర్తన మారడం లేదు. తాజాగా, తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ కీచక పర్వం వెలుగులోకి వచ్చింది. ఉద్యోగం పేరుతో ఓ మహిళను ఏడాదిన్న కాలంగా బెదిరిస్తూ వచ్చాడు. లోబర్చుకున్నాడు. గర్భవతి కావడంతో ఆమెకు అబార్షన్‌ చేయించాడు.

ఇదేమని ప్రశ్నిస్తే.. ఐటీ ఉద్యోగం చేస్తున్న ఆమె భర్తకు విడాకులు ఇవ్వాలని హుకుం జారీ చేశాడు. పెళ్లి చేసుకుంటానని బలవంతం చేశాడు. అందుకు ఒప్పుకోకపోవడంతో ఆమె భర్తకు ఫోన్‌ చేసి బెదిరించాడు. దీంతో బాధితురాలికి ఆమె భర్తకు విభేదాలు తలెత్తాయి. భర్తకు విడాకులు ఇవ్వాలని.. తాను ఎమ్మెల్యేనని చెప్పింది చేయాల్సిందేనని పట్టుబడట్టాడు. లేదంటే బాధిత మహిళ మూడేళ్ల కుమారుణ్ని ప్రాణం తీస్తానని హెచ్చరించారు. ఇలా ఏడాదిన్నర కాలంగా జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ ఆగడాలు తట్టుకోలేని మహిళ తాజాగా, వీడియోలు, వాట్సాప్‌ చాట్‌లతో సహా బయట పెట్టడం కలకలం రేపుతోంది.




Updated On
ehatv

ehatv

Next Story