Scrub Typhus : ఏపీలో స్క్రబ్ టైఫస్ కేసుల భయం..భయం.. 20కి చేరిన మృతులు..!
ఆంధ్రప్రదేశ్‌లో స్క్రబ్ టైఫస్ కేసులు పెరుగుతూ కలకలం రేపుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో స్క్రబ్ టైఫస్ కేసులు పెరుగుతూ కలకలం రేపుతున్నాయి. తాజాగా బాపట్ల జిల్లా పెదపులుగువారిపాలెంలో నాగబాబు(21) అనే యువకుడు ఈ వ్యాధితో మరణించాడు. కొన్నిరోజులుగా జ్వరంతో బాధపడుతున్న అతడిని గుంటూరు జీజీహెచ్‌కు తీసుకెళ్లగా పరీక్షల్లో స్క్రబ్ టైఫస్‌గా తేలింది. పరిస్థితి విషమించడంతో చనిపోయాడు. దీంతో మృతుల సంఖ్య 20కి చేరింది. కాగా ఈ పురుగు రాత్రి వేళల్లో కుడుతుంది. రాష్ట్రంలో అంతకంతకూ కేసులు పెరగడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కారణాలు నిర్ధారించేందుకు ప్రభుత్వం జీనోమ్ సీక్వెన్సింగ్ చేపడుతోంది. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుండగా, ఆసుపత్రుల్లో డాక్సీసైక్లిన్, ఎజిథ్రోమైసిన్ మందులను అందుబాటులో ఉంచారు. జ్వరం వచ్చిన వెంటనే వైద్యుడిని సంప్రదించాలని, స్క్రబ్ టైఫస్ చిగ్గర్ మైట్స్ కాటు ద్వారా వ్యాపిస్తుండటంతో పొలాలు, పచ్చిక బయళ్లలో పనిచేసేవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్యశాఖ సూచిస్తోంది.
- Andhra Pradesh scrub typhusscrub typhus deaths APscrub typhus outbreakBapatla district newsyoung man dies of scrub typhusAP health alertchigger mite infectionscrub typhus symptomsrising fever cases Andhra Pradeshgovernment genome sequencingdoxycycline availabilityazithromycin treatmentpublic health warning APehatv


