విద్యార్థిని సుగాలి ప్రీతి అనుమానాస్పద మృతి కేసులో తన బిడ్డకు న్యాయం చేయాలంటూ పోరాడుతున్న ఆమె తల్లి సుగాలి పార్వతిని పోలీసులు హౌస్ అరెస్ట్‌ చేశారు.

విద్యార్థిని సుగాలి ప్రీతి అనుమానాస్పద మృతి కేసులో తన బిడ్డకు న్యాయం చేయాలంటూ పోరాడుతున్న ఆమె తల్లి సుగాలి పార్వతిని పోలీసులు హౌస్ అరెస్ట్‌ చేశారు. పార్వతి చేస్తున్న న్యాయపోరాటానికి అడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి. గురువారం కర్నూలులో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా, సుగాలి పార్వతి ప్రధానిని కలుసుకుని తమకు న్యాయం చేయాలని కోరుతూ వినతి పత్రాన్ని సమర్పించాలని భావించారు. అయితే పలు భద్రతా కారణాలు చూపుతూ, ఆమెను ముందస్తుగా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఆమెతో పాటు సుగాలి ప్రీతి కుటుంబ సభ్యులందరినీ పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. సుగాలి ప్రీతి ఘాతుకానికి కారణమైన నిందితులను శిక్షించాలని సుగాలి పార్వతి ప్రభుత్వాన్ని కోరుతోంది.

Updated On
ehatv

ehatv

Next Story