✕
రాష్ట్ర రాజకీయాల్లో విషాదం చోటుచేసుకుంది.

x
రాష్ట్ర రాజకీయాల్లో విషాదం చోటుచేసుకుంది. రాయచోటి మాజీ ఎమ్మెల్యే సుగవాసి పాలకొండ్రాయుడు(Sugavasi Palakondrayudu) (78) కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బెంగళూరు(Bengaluru )లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన ఈ లోకాన్ని వీడారు. 1978లో ఇప్పటి అన్నమయ్య జిల్లా(Annamayya district) రాయచోటి నుంచి జనతా పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1983లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఇక 1984 ఎన్నికల్లో రాజంపేట(Rajampet) లోక్‌సభ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు. అంతేకాకుండా 1999, 2004లో రాయచోటి(Rayachoti) నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా సుగవాసి పాలకొండ్రాయుడు విజయం సాధించారు. ఆయన మృతి పట్ల టీడీపీ నేతలు, అభిమానులు సంతాపం ప్రకటిస్తున్నారు.

ehatv
Next Story