నీ భర్తకు అంత్యక్రియలు చేయాలంటే నా కోరిక తీర్చాల్సిందేనంటూ ఓ టీడీపీ నాయకుడు మహిళ పట్ల అమానుషంగా ప్రవర్తించాడు.

నీ భర్తకు అంత్యక్రియలు చేయాలంటే నా కోరిక తీర్చాల్సిందేనంటూ ఓ టీడీపీ నాయకుడు మహిళ పట్ల అమానుషంగా ప్రవర్తించాడు.టీడీపీ నాయకుడినని చెప్పుకుంటూ ఓ కీచకుడి దాష్టీకానికి పాల్పడ్డాడు. బ్రతుకుదెరువు కోసం గల్ఫ్ వెళ్లి, ప్రమాదంలో భర్తలను కోల్పోయిన వితంతువులను టార్గెట్ చేస్తున్న దుర్మార్గుడు. తాను టీడీపీ నాయకుడినని, గల్ఫ్ నుండి విజయవాడ వరకు తాను చెప్పినట్లుగానే నడుస్తుందని వింతతువులకు బెదిరింపులకు దిగుతున్నాడు. మీరు ముఖ్యమంత్రికి చెప్పినా మళ్లీ నా సహాయం కోసం రావాల్సిందేనని, దాని బదులు సాయంత్రం కాసేపు నా ఇంటికి వస్తే అంత్యక్రియలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని వితంతువులను కీచకుడు బెదిరిస్తున్నాడు. భర్తలను కోల్పోయి సహాయం కోసం చూసే వితంతువులు, స్వదేశానికి తిరిగి రావడానికి సహాయం కోరే మహిళలను టీడీపీ నాయకుడిగా చలామణి అవుతూ వేధిస్తున్నాడని ఆరోపణలు వస్తున్నాయి. విజయవాడలో టీడీపీ నాయకులకు ఫిర్యాదు చేసిన కొందరు బాధిత మహిళలు. మరో గల్ఫ్ దేశంలోనూ టీడీపీ నాయకుడిగా చలామణి అవుతూ అక్రమాలకు పాల్పడిన వ్యక్తిని 24 గంటలలో దేశ బహిష్కరణ చేసిన అక్కడి ప్రభుత్వం. టీడీపీ నాయకుడిగా చలామణి అవుతూ తమ లాంటి ఎందరో మహిళల జీవితాలతో చెలగాటం ఆడుకున్నాడని, అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ నాయకులకు ఫిర్యాదు చేస్తున్న బాధిత మహిళలు

Updated On
ehatv

ehatv

Next Story