వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి.‌ ముందుగా అర్చకులు స్వామివారికి ఏకాంతంగా ప్రత్యేక పూజా కైంకర్యాలు నిర్వహించారు.

వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి.‌ ముందుగా అర్చకులు స్వామివారికి ఏకాంతంగా ప్రత్యేక పూజా కైంకర్యాలు నిర్వహించారు. మంగళవారం తెల్లవారుజామున 1.25 గంటలకు వైకుంఠ ద్వారాలు తెరిచారు. ఆ క్షణాన్ని వీక్షించేందుకు భక్తులు ఆధ్యాత్మిక ఉత్సాహంతో ఎదురుచూశారు. ఈ వైకుంఠ ద్వారం గుండా దర్శనం చేస్తే మోక్షప్రాప్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం.

వైకుంఠ ద్వార దర్శనాల ప్రారంభంలో ముందుగా ప్రముఖులకు దర్శన సౌకర్యం కల్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకుని వైకుంఠ ద్వారం గుండా బయటకు వచ్చారు. ఆలయానికి వచ్చిన సీఎంకు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. దర్శనం అనంతరం అర్చకులు సీఎంకు తీర్థప్రసాదాలు అందజేసి వేదాశీర్వచనాలు చేశారు. ఇదే సమయంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక ఆశీస్సులు పొందారు.

వైకుంఠద్వారం నుంచి శ్రీవారిని దర్శించుకున్న నటుడు చిరంజీవి, కుటుంబసభ్యులు. వైకుంఠద్వారం నుంచి శ్రీవారిని దర్శించుకున్న నటుడు నారా రోహిత్ దంపతులు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నిర్మాత డీవీవీ దానయ్య. శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్న భారత్ బయోటెక్ ఎండీ కృష్ణ ఎల్లా. శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్న టీటీడీ బోర్డు సభ్యురాలు సుచిత్ర ఎల్లా. శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్న క్రికెటర్ తిలక్ వర్మ. శ్రీవారిని దర్శించుకున్న ఎంపీ వేమిరెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి దంపతులు. శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్న సినీ నటుడు శివాజీ. శ్రీవారిని దర్శించుకున్న మాజీ మంత్రులు రోజా, పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి. ఇంకా సినీ నటులు, మీడియా ప్రముఖులు ఇలా ఎంతో మంది వీఐపీ దర్శనాల ద్వారా స్వామివారిని దర్శించుకున్నారు.

అయితే వైకుంఠ ఏకాదశి సందర్భంగా వీఐపీల కోసం గంటలపాటు సామన్యభక్తులను అనుమతించకపోవడం చర్చనీయాంశమైంది. దాదాపు 30 గంటల పాటు భక్తులు క్యూకాంప్లెక్సులలో వేచి చూస్తున్నారు. సామాన్యులకు దర్శనం కల్పించకుండా ఓన్లీ వీఐపీలకు మాత్రమే టీటీడీ ప్రాధాన్యమిచ్చిందనే విమర్శలు వస్తున్నాయి.

Updated On
ehatv

ehatv

Next Story