CBI -JAGAN: ఇంకా జగన్ చేతిలోనే CBI, టీడీపీ మీడియా ఏం చెప్పాలనుకుంది...!
CBI -JAGAN: ఇంకా జగన్ చేతిలోనే CBI, టీడీపీ మీడియా ఏం చెప్పాలనుకుంది...!

తిరుమల లడ్డు కల్తి అంశానికి సంబంధించి CBI ఆధ్వర్యంలో ఒక సీట్ ఏర్పాటయింది. సిట్ విచారణ చేసింది, రకరకాల వ్యక్తులని విచారించి, అనేక డాక్యుమెంట్ పరిశీలించి, ఇతర రాష్ట్రాల్లో కూడా వెళ్లి, అక్కడ కూడా చూసి, శోధించి, సాధించి, ఒక రిపోర్ట్ ని ఇచ్చింది. ఆ రిపోర్ట్ లో ఉన్న ప్రధానమైన అంశం ఆ లడ్డూలో జంతువుల కొవ్వు కలవలేదు అనే విషయం తేల్చింది. దాంతో పాటు అంతకుముందు ప్రొక్యూర్ చేసిన నెయ్యిలో కల్తీ జరిగింది, అసలు నెయ్యి చుక్క కూడా లేకుండానే కెమికల్స్ తో నెయ్యి తయారు చేశారు అంటూ సిట్ చెప్పినట్లుగా మీడియా కథనాలు చూస్తున్నాం. ఎందుకంటే నేను ఈ వీడియో చేస్తున్న క్షణం వరకు, సిట్ రిపోర్ట్ ని నేను పూర్తిగా చదవలేదు, బహుశా సాయంత్రమో, రేపో, సిట్ రిపోర్ట్ ని పూర్తిగా స్టడీ చేసిన తర్వాత, శ్రీవారి భక్తుడిగా పూర్తి వాస్తవాలు సిట్ ఏం చెప్పింది అనేది, మీ దృష్టికి తీసుకొస్తాను, కానీ తెలుగుదేశం పార్టీ మీడియా రాస్తున్న వార్తల ఆధారంగా, జంతువుల కొవ్వు కలవలేదు అనే విషయాన్ని, ఆ పత్రికలు, తెలుగుదేశం పార్టీ మీడియా రాసిన వార్తల ఆధారంగా ఇంతకుముందు ఒక వీడియో చేశాను నేను. వాళ్ళే చెప్తున్నారు జంతువుల కొవ్వు కలవలేదు అని, సో ఇప్పుడు నిన్న ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియా రాస్తున్న వార్తలు, లడ్డు మొత్తం కల్తి అయిపోయింది, 68 లక్షల లీటర్లు టన్నుల్లో, నెయ్యి తీసుకొచ్చి లడ్డూలు కలిపి తయారు చేశారు, సో ఆ లడ్డూలన్నీ జనం తినేశారు, ఆ లడ్డూలు వాడిన కెమికల్స్ ఏ కెమికల్స్ బాడీలో, ఏ పార్టి పైన ఎంత ప్రభావం చూపిస్తుందో కూడా విశ్లేషణలు చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు లడ్డు కల్తి అయిందని చెప్పలేదు, లడ్డు కల్తి అయిందని మాత్రమే చెప్పలేదు, లడ్డులో జంతువుల కొవ్వు కలిపారు అని చెప్పారు, ఇంకో ఉపముఖ్యమంత్రి అయితే, ఆవు, పంది కొవ్వు కలిపారు అని చెప్పారు. ఇంకొంతమంది అయితే నోటితో ఇంకా చాలా చెప్పారు, ఇవి చెప్పారు, ఇవి ఎక్కువ మందిని జనాలని టెన్షన్ పెట్టాయి, గడిచిన దశాబ్దన్నర, రెండు దశాబ్దాల కాలంలో టిటిడి దగ్గర ఒక చెక్ అండ్ బాలెన్సెస్ మెకానిజం ఉంది, బయట నుంచి మనం టెండర్లు పిలిచినా, ఎవరైనా నెయ్యి తీసుకొచ్చిన సందర్భంగా టిటీడి మళ్ళీ చెక్ చేసుకొని, ఆ నెయ్యి సరిగ్గా ఉంటేనే లోపలికి అనుమతిస్తుంది, సరిగ్గా లేకపోతే రిజెక్ట్ చేస్తుంది, అలా రిజెక్ట్ చేసిన సందర్భాలు గతంలో తెలుగుదేశం పార్టీ పాలించిన సందర్భంలోనూ, తర్వాత వైసీపీ పాలించిన సందర్భంలోనూ అనేకం ఉన్నాయి. అలా చాలా సందర్భాల్లో రిజెక్ట్ చేశారు నెయ్యి అడల్టరేషన్ జరిగింది అని, ఇప్పుడు సిట్ రిపోర్టు ఏం చెప్పింది అంటే, సిట్ రిపోర్టు కి బేస్ అయిన రిపోర్ట్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, లడ్డుకి సంబంధించిన రిపోర్ట్స్ ఎక్కడి నుంచి వచ్చాయి అంటే, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, టెండర్లు ఫైనలైజ్ అయ్యి, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, నెయ్యి సప్లై చేయడం స్టార్ట్ చేసిన కంపెనీలు అడల్టరేషన్ కి పాల్పడుతున్నాయని, ఎక్కడికో పంపిస్తే దాంట్లో ఏదో వచ్చింది అని చెప్పారు, ఆ లడ్డూలు, ఆ నెయ్యిని పరిశీలించిన తర్వాత మాత్రమే తేలింది, గత ఐదేళ్లకు సంబంధించిన లడ్డూల్ని, గత ఐదేళ్లకు సంబంధించిన నెయ్యిని తీసుకొచ్చి, ఈ క్షణానికి ఎక్కడ ల్యాబ్ లో టెస్ట్ చేయలేదు, ఎవరు స్టోర్ చేసి పెట్టలే, స్టోర్ చేసి పెట్టలేదు కాబట్టి, దాన్ని టెస్ట్ చేశారా, లడ్డు టెస్ట్ చేశారా, అప్పటి నెయ్యి టెస్ట్ చేశారా అంటే లేదు, కానీ వీళ్లే రకరకాల రూపంలో టెండర్లు వేశారు కాబట్టి, వీళ్ళు గతంలో ఇలా చేసి ఉంటారు, మేము విచారిస్తే వాళ్ళు మాకు చెప్పారు అనేది బహుశా సిట్ చెప్తున్న ఫైండింగ్ ఏమో, నిన్న ఈరోజు తెలుగుదేశం పార్టీ మీడియా చేస్తున్న వాదన నేను వీడియోలో చెప్పాలనుకున్న. ప్రధానమైన కోర్ ఇష్యూ అది, సిట్ ఏం జరిగింది అది, తర్వాత చెప్తాను, ఈ వీడియోలో..!


