YNR Analysis: పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలో థర్డ్‌ ప్లేస్‌లో వైసీపీ.. కూటమి ప్లాన్‌పై 'YNR' సంచలన విశ్లేషణ..!

YNR Analysis: పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలో థర్డ్‌ ప్లేస్‌లో వైసీపీ.. కూటమి ప్లాన్‌పై 'YNR' సంచలన విశ్లేషణ..!

By :  ehatv
Update: 2025-08-13 11:39 GMT

పులివెందుల జెడ్పిటీసి ఎన్నికల సందర్భంగా జరిగిన వ్యవహారం చూసినప్పుడు రీపోలింగ్‌కి అర్హత ఉండే అన్ని అక్రమాలు, అవకతవకలు జెడ్పిటీసి ఎన్నికల్లో జరిగాయని నిన్న నేను ఒక వీడియో చెప్పా. అది నేను వీడియో చెప్పడానికి కారణమైన సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ సోషల్ మీడియాలో విస్తృతంగా ఉంది, చాలా మంది మాట్లాడుతున్నారు, మా ఓటు వేయలేకపోయామ అని చెప్తున్నారు, మా దగ్గరే స్లిప్పులు ఉన్నాయి, మేము వెళ్ళేసరికి మా ఓటు వేసేశారు, వేరే వాళ్ళు అని చెప్తున్నారు. సో పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా మమ్మల్ని బూతులలోకి అలో చేయలేదు అని చెప్తున్నారు, ఇది జర్నలిస్ట్ వైఎన్ఆర్‌గా నేను చేస్తున్న ఆరోపణ కాదు, కొన్ని వందల వీడియోలు పులివెందుల జెడ్పిటీసి పరిధిలోని మహిళలు ఓటర్లు మాట్లాడినవి, అన్ని న్యూస్ ఛానల్స్ లో కనపడుతున్నాయి, కానీ ఎన్నికల కమిషన్ కి కనపడలేదు, ఎన్నికల కమిషన్ అక్కడ ఏం జరిగిందో కనీసం తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు, నిన్న సాయంత్రం పోలింగ్ ముగిసిన తర్వాత పులివెందుల జెడ్పిటీసి ఎన్నికలను ప్రత్యక్షంగా వెళ్లి పర్యవేక్షించిన డిఐజి కోయ ప్రవీణ్ చాలా ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయి, ఒకటి రెండు చిన్న చిన్న ఘర్షణలు మినహా ప్రశాంతంగా, పీస్ ఫుల్ గా ఎన్నికలు జరిగాయి. ప్రజాస్వామ్య యుతంగా ఎన్నికలు జరిగాయి, ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు, బ్రహ్మాండంగా ఎన్నికలు చేశామని చెప్పారు, కానీ అక్కడ పోటీ చేసిన కొంతమంది ఇండిపెండెంట్ అభ్యర్థులు, ఎలక్షన్ కమిషన్ కి కంప్లైంట్ చేశారు, ఎన్నికలు సరిగ్గా జరగలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలో రెండు చోట్ల రీపోలింగ్ కి ఆర్డర్ చేశారు, సో ఎలక్షన్ కమిషన్ రీపోలింగ్ కి ఆర్డర్ చేసింది ఆ రెండు చోట్ల సరిగ్గా ఎన్నికలు జరగలేదు, మిగతా అంతా బాగానే జరిగాయిని కన్విన్స్ అయిందేమో, బట్ డిఐజీ నిన్నే చెప్పారు అంతా బాగా జరిగిందని, అంతా బాగా జరిగితే రెండు చోట్లయినా రీపోలింగ్ ఎందుకు చేయాల్సి వచ్చింది అనేదానికి ప్రభుత్వం, పోలీస్ యంత్రంగం సమాధానం చెప్పాల్సి ఉంటుంది. సో ఒక ఎన్నికలో అధికార పార్టీ తలుచుకుంటే ఎన్ని అక్రమాలు చేయొచ్చు అనేదానికి ఒక పరాకాష్ట పులివెందుల ఎన్నిక. పులివెందుల ఎన్నిక సందర్భంగా మెజారిటీ ఓటర్లని పోలింగ్ బూతుల వైపు రానేయలేదు, 80 శాతానికి పైగా ఓటర్లు పులివెందులలో ఓటు హక్కు వినియోగించుకోలేదు, కేవలం 20 శాతం మంది మాత్రమే పోలైన ఓట్లలో 20 శాత మంది మాత్రమే ఓటు వేసి ఉంటారు, వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేని ఓటర్లని భావించిన వాళ్ళని మాత్రమే పోలింగ్ బూతుల వరకు రానిచ్చారు, కనపడాలి కాబట్టి, ఓటింగ్ జరిగినట్టు కనపడాలి కాబట్టి, సో పులివెందల ఉపఎన్నిక ద్వారా ఏం సాధిస్తుంది, అధికార పార్టీ కొత్తగా వచ్చే కిరీటం ఏంటి, ఏం లేదు కదా, ఎందుకు ఇంత ప్రెస్టేజ్ గా తీసుకుంది, ఎందుకు ఇలా చేసింది అంటే పులివెందులలో మేము గెలిచాం, పులివెందుల తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేశాం అని చెప్పుకోవాలనుకుంటుంది.ఈ అంశంపై సీనియర్‌ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..

Full View

Tags:    

Similar News