కూటమి ప్రభుత్వ పాలనలో సూపర్‌ సిక్స్‌ అట్టర్‌ఫ్లాప్‌ సినిమా అని జగన్‌ దెప్పి పొడిచారు.

కూటమి ప్రభుత్వ పాలనలో సూపర్‌ సిక్స్‌ అట్టర్‌ఫ్లాప్‌ సినిమా అని జగన్‌ దెప్పి పొడిచారు. సూపర్‌ సిక్స్‌ అనే.. అట్టర్‌ ఫ్లాప్‌ అయిన సినిమాకు బలవంతపు విజయోత్సవాలు జరుపుతున్నారు. అనంతపూరంలోలో ఈరోజు ఇదే చెప్పచోతున్నారు అని చెప్పుకొచ్చారు. చంద్రబాబు అబద్ధాలు, మోసాలు ఒక స్థాయిలోనే ఉంటాయి. కళ్లార్పకుండా అబద్ధాలు చెప్పే వ్యక్తి చంద్రబాబు అని వ్యంగంగా వ్యాఖ్యలు చేశారు.

సూపర్‌ సిక్స్‌ అట్టర్‌ ప్లాప్‌ అని ప్రజలకు అర్ధమైంది. ఎన్నికలకు ముందు ఇచ్చిన అడ్వర్‌టైజ్‌మెంట్‌.. ఇది ఏ లెవల్‌ మోసమో.. వాళ్ల అనుకూల మీడియాలో వచ్చిన అడ్వైర్‌టైజ్‌మెంట్లను చూడండి. 50 ఏళ్ల వాళ్లకు పెన్షన్‌ తీసేశారు. ఆడబిడ్డ నిధి ఎగిరిపోయింది. మూడు వేల రూపాయల నిరుద్యోగ భృతి.. కనిపించడం లేదు. క్యాంటీన్లను ఇప్పుడు కొత్తగా సూపర్‌సిక్స్‌లో చేర్చారు. ఎన్నికలకు ముందు జగన్‌ ఇచ్చిన హామీలతో పాటు అదనంగా ఇస్తానని చంద్రబాబు వాగ్దానం చేశారు.

ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్‌ సిక్స్‌కు ఈరోజు సూపర్‌ సిక్స్‌ అసలు పొంతన కూడా లేదు. ఇప్పుడు ఇచ్చేది కాకుండా రైతులకు అదనంగా రూ.20వేలు ఇస్తామన్నారు. తల్లికి వందనం కింద ఆంక్షలు లేకుండా ప్రతీ బిడ్డకు రూ.15వేలు ఇస్తామన్నారు. ఆర్టీసీ బస్సుల్లో ఏ ఊరికి పోవాలన్నా ఉచితం అని చెప్పారు. ఏడాదికి మూడు గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చారు. గతేడాది ఎన్ని ఇచ్చారు. ఇప్పటి వరకు ఎన్ని ఇచ్చారు. ఆడబిడ్డ నిధి పేరుతో నెలకు రూ.1500 ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రతి మహిళకు ఇస్తున్నారా అని జగన్‌ ప్రశ్నించారు.

ehatv

ehatv

Next Story