✕
Mithun Reddy Arrest : మిథున్‌రెడ్డి అరెస్ట్..!
By ehatvPublished on 19 July 2025 6:39 AM GMT
లిక్కర్ స్కాంలో ఎంపీ మిథున్‌రెడ్డి సిట్ ముందుకు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో ఎంపీ మిథున్ అరెస్ట్ పైన పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది.

x
లిక్కర్ స్కాంలో ఎంపీ మిథున్‌రెడ్డి సిట్ ముందుకు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో ఎంపీ మిథున్ అరెస్ట్ పైన పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. ఈ కేసులో ఇప్పటికే మిథున్‌రెడ్డిపై అరెస్ట్ వారెంట్ జారీ చేయాలని కోరుతూ విజయవాడ ఏసీబీ కోర్టులో సిట్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై పరిశీలించిన కోర్టు, సుప్రీంకోర్టు ఇచ్చిన మెమో, ఇతర పత్రాల జత చేయకపోవడాన్ని గుర్తించి రిటర్న్ చేసింది. సంబంధిత పత్రాలతో పిటిషన్ వేయాలని వెనక్కి పంపింది. అటు ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్‌ను ఇప్పటికే సుప్రీంకోర్టు కొట్టేసింది. ఈ తరుణంలో మిథున్ ను అరెస్ట్ చేసేందుకు సిట్ అధికారులు వారెంట్ కోరుతూ విజయవాడ ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో మిథున్‌రెడ్డి నివాసం ఉంటున్న ప్రాంతాల్లో సోదాలు జరిపేందుకు, అరెస్ట్ చేసేందుకు చట్ట ప్రకారం అధికారులు ముందుకు వెళ్తున్నారు.

ehatv
Next Story