✕
అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో పసిడి ధరలు కొత్త గరిష్ఠాలను చేరుకుంటున్నాయి.

x
అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో పసిడి ధరలు కొత్త గరిష్ఠాలను చేరుకుంటున్నాయి. ఈరోజు స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 42 డాలర్లు మేర పెరిగి 3994 డాలర్ల స్థాయికి ఎగబాకింది. ఇక స్పాట్ సిల్వర్ రేటు మాత్రం స్వల్పంగా తగ్గింది. ఈరోజు స్పాట్ సిల్వర్ ఔన్సుకు 1.60 శాతం మేర తగ్గింది. దీంతో ఔన్స్ సిల్వర్ ధర 47.85 డాలర్లకు దిగివచ్చింది. 24 క్యారెట్ల బంగారం రేటు తులానికి క్రితం రోజు రూ.1370 మేర పెరగగా ఈరోజు మరో రూ.1250 పెరిగింది. దీంతో రెండ్రోజుల్లోనే రూ. 2620 మేర పెరిగి ఇవాళ 10 గ్రాములకు రూ.1,22,020 వద్ద సరికొత్త గరిష్ఠాన్ని చేరింది. ఇక 22 క్యారెట్ల బంగారం రేటు రెండ్రోజుల్లో తులం రేటు రూ.2400 మేర పెరిగింది. దీంతో 10 గ్రాముల ఆభరణాల గోల్డ్ రేటు రూ. 1,11,850 వద్దకు చేరుకుంది.

ehatv
Next Story