ముంబైలో జరిగిన ఈ దారుణ ఘటనలో, 40 ఏళ్ల మహిళా ఉపాధ్యాయురాలు తన 16 ఏళ్ల విద్యార్థిపై ఏడాది కాలంగా లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది.

ముంబైలో జరిగిన ఈ దారుణ ఘటనలో, 40 ఏళ్ల మహిళా ఉపాధ్యాయురాలు తన 16 ఏళ్ల విద్యార్థిపై ఏడాది కాలంగా లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది. 40 ఏళ్ల మహిళా ఉపాధ్యాయురాలు, ఇంగ్లీష్ టీచర్(English Teacher)గా పనిచేస్తుంది. ఇద్దరు పిల్లల తల్లి. ఆమె 16 ఏళ్ల 11వ తరగతి విద్యార్థిపై 2023 డిసెంబర్‌లో పాఠశాల వార్షికోత్సవం కోసం డాన్స్ గ్రూప్‌లను సిద్ధం చేస్తున్న సమయంలో ఆకర్షితురాలైనట్లు తెలుస్తోంది. ఆమె విద్యార్థికి యాంటీ-యాంగ్జైటీ మందులు ( Anti Anxiety Pills)ఇచ్చి, మద్యం సేవింపజేసి, ఫైవ్ స్టార్ హోటళ్ల(Five Star Hotel)లో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటన ముంబై(Mumbai)లోని ఒక ప్రముఖ పాఠశాలలో చోటుచేసుకుంది. పోలీసులు ఆమెపై పాక్సో (POCSO) చట్టం కింద సెక్షన్ 4 , సెక్షన్ 6, సెక్షన్ 17తో పాటు, భారతీయ శిక్షాస్మృతి జువెనైల్ జస్టిస్ (పిల్లల సంరక్షణ) చట్టం, 2015లోని సంబంధిత నిబంధనల కింద కేసు నమోదు చేశారు. ఆమె సహాయంగా ఉన్న మరో ఉపాధ్యాయుడు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. విద్యార్థి తొలుత ఆమె చర్యలకు నిరాకరించినప్పటికీ, ఆమె స్నేహితురాలి సహాయంతో అతన్ని ఒప్పించి, ఒంటరి ప్రదేశాలకు తీసుకెళ్లి ఈ దుష్ప్రవర్తనకు పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటన విద్యా సంస్థల్లో విద్యార్థుల భద్రతపై తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తోంది. ప్రస్తుతం ఈ కేసుపై మరింత దర్యాప్తు కొనసాగుతోంది. విద్యార్థి ప్రవర్తనలో మార్పు రావడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
