Doctor Sex: యువ వైద్యురాలిపై వైద్యుడు లైంగిక దాడి..!

Doctor Sex: యువ వైద్యురాలిపై వైద్యుడు లైంగిక దాడి..!

By :  ehatv
Update: 2025-05-22 05:09 GMT

హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో మహిళా వైద్యురాలిపై మరో వైద్యుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్ స్వామి అనే వ్యక్తి, హైదరాబాద్‌లోని నిలోఫర్ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఒక మహిళా వైద్యురాలిపై లైంగిక దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అతను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, బంజారాహిల్స్‌లోని ఒక ప్రముఖ హోటల్‌కు ఆమెను పిలిచి ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. బాధిత మహిళా వైద్యురాలు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

డాక్టర్ స్వామి మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుడిగా పనిచేస్తున్నాడు. అతను 2023లో బాధితురాలితో పరిచయం ఏర్పడినట్లు, ఆ తర్వాత పెళ్లి పేరుతో ఆమెను నమ్మించాడు. తన భార్యకు విడాకులు ఇస్తున్నానని, ఆమె తనను బలవంతంగా పెళ్లి చేసుకుందని, ఇప్పటికే నాలుగు సార్లు అబార్షన్‌ అయిందని నమ్మించాడు. 2024 సెప్టెంబర్‌లో వైద్యురాలు నగరానికి వచ్చి ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యురాలిగా పనిచేస్తోంది. ఇదిలా ఉండగా డాక్టర్‌ స్వామి ఈ ఏడాది జనవరి 12న నేషనల్‌ పెడికాన్‌ సదస్సు నిమిత్తం నగరానికి రాగా ఆ సదస్సుకు యువ వైద్యురాలు సైతం హాజరైంది. ఇద్దరు కలిసి అదే రోజు బంజారాహిల్స్‌ లోని పార్క్‌ హయత్‌ హోటల్‌లో గది తీసుకున్నారు. పెళ్లి పేరుతో నమ్మించిన డాక్టర్‌ స్వామి ఆమెపై బలవంతంగా లైంగిక దారికి పాల్పడ్డాడు. విషయం బయటికి తెలియవద్దని పెళ్లి చేసుకుంటానని నమ్మించి వెళ్లిపోయాడు. స్వామి వ్యవహార తీరును అనుమానించిన యువ వైద్యురాలు అతని గురించి విచారించగా భార్యకు విడాకులు ఇవ్వలేదని తెలుసుకున్నది. తనకు జరిగిన అన్యాయాన్ని స్వామి తల్లిదండ్రుల దృష్టికి యువ వైద్యురాలు తీసుకెళ్లింది. వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆమె సోమవారం రాత్రి బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా మంగళవారం పోలీసులు డాక్టర్‌ స్వామి, అతని కుటుంబ సభ్యులపై బి.ఎన్‌.ఎస్‌ 64 (1), 318(4), 318(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News