ఓ వ్యక్తికి పెళ్లి జరిగి ఏడాదిన్నర గడుస్తోంది. ఆమె వైద్యురాలుగా కూడా పనిచేస్తోంది.

ఓ వ్యక్తికి పెళ్లి జరిగి ఏడాదిన్నర గడుస్తోంది. ఆమె వైద్యురాలుగా కూడా పనిచేస్తోంది. సక్రమంగా సాగుతుందని అనుకున్న కొత్త కాపురంలో కోడలిపై మామకు కనపడింది.కోడలితో కోరిక తీర్చుకోవాలని, తన కోరికను కొడుక్కి చెప్పాడు తండ్రి. దీంతో తన తండ్రి కోరిక తీర్చాలంటూ భార్యను వేధించరాగాడు. తన తండ్రితో పడుకోకుంటే నీ న్యూడ్ వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు.ఈ వేధింపులు తట్టుకోలేక భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. హైదరాబాద్(Hyderabad) లోని మధుర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే.. యూసుఫ్ గూడా(yousaf Guda) జవహర్ నగర్ లో ఉంటున్న వైద్యురాలు వయసు 25కు ఏడాదిన్నర క్రితం ఎల్లారెడ్డి గూడాలోని ఆర్బిఐ క్వార్టర్స్ లో నివాసం ఉంటున్న యువకుడుతో పెళ్లి జరిగింది. పెళ్లి సమయంలో కట్నం కింద విలువైన వస్తువులు, బంగారం, 10 లక్షల నగదును కూడా ఇచ్చారు. సాఫ్ట్వేర్ ఉద్యోగం అంటూ బాధితురాలు కుటుంబాన్ని నమ్మించాడు. పెళ్లి తర్వాత అతనికి ఉద్యోగం లేదని తేలింది. అయినా బాధితురాలు సర్దుకుని పోయి అతనితో కాపురం చేసింది. ఈ క్రమంలోనే వారికి పాప పుట్టింది. ఇక అప్పటినుంచి మొదలైంది అసలు వేధింపుల కార్యక్రమం. కొడుకుని కన లేదు కూతురుని కన్నావని వేధించసాగారు. ఈ క్రమంలోని భార్య స్నానం చేస్తుండగా నగ్న వీడియోలు తీశాడు. ఆమె వద్దని వాదిస్తున్నా కానీ ఆమె ఫోటోలు, వీడియోలు తీశాడు. ఈ క్రమంలోనే అత్త చనిపోయింది. తన భార్య నగ్న వీడియోలను తండ్రికి కూడా చూపెట్టాడు. ఆ వీడియోలను చూసి తండ్రికి కోరిక కలిగింది. దీంతో తన భార్యను తండ్రి గదిలోకి పంపించేవాడు. అనుపట్ల మామ సభ్యంగా ప్రవర్తించేవాడు. వేయరానిచోట చేతులు వేసి ఆమెను అసభ్యంగా తాకేవాడు. పలుమార్లు అత్యాచారానికి ప్రయత్నించాడు. తండ్రి కొడుకుల వేధింపులు భరించలేక ఆమె మధుర నగర్ పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నారు.
