సోషల్ మీడియా వేదికల ద్వారా అపరిచితులతో స్నేహం చేయడం, ప్రేమ లేదా వివాహం వంటి ఆకర్షణల పేరుతో సంబంధాలు ఏర్పడటం సర్వసాధారణం.

సోషల్ మీడియా వేదికల ద్వారా అపరిచితులతో స్నేహం చేయడం, ప్రేమ లేదా వివాహం వంటి ఆకర్షణల పేరుతో సంబంధాలు ఏర్పడటం సర్వసాధారణం. అయితే, కొన్ని సందర్భాల్లో ఇవి మోసాలు, బెదిరింపులు లేదా హింసాత్మక సంఘటనలకు దారితీస్తాయి. సోషల్ మీడియాలో అజ్ఞాత వ్యక్తులతో చేసే చాటింగ్ లేదా ట్రోలింగ్ వల్ల మానసిక ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ వంటివి పెరిగి, కొన్ని సందర్భాల్లో ఆత్మహత్యలకు కూడా కారణమవుతున్నాయి. అపరిచితులతో ఆన్‌లైన్ సంబంధాలు బ్లాక్‌మెయిల్, ఆర్థిక మోసాలు, లైంగిక వేధింపుల వంటి సైబర్ నేరాలకు దారితీస్తున్నాయి. పిల్లలు, యువత ఈ ప్రమాదాలకు ఎక్కువగా గురవుతున్నారు. కొన్ని సందర్భాల్లో, సోషల్ మీడియా ద్వారా ఏర్పడిన పరిచయాలు హత్యలు, లైంగిక దాడులు వంటి తీవ్రమైన నేరాలకు దారితీశాయి. సోషల్ మీడియా వాడకంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం, అపరిచితులను సులభంగా నమ్మడం. సోషల్ మీడియాకు బానిస కావడం వల్ల, యువత లేదా పిల్లలు ప్రమాదకర కంటెంట్‌కు గురవుతున్నారు. వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేయడం వల్ల సైబర్ నేరగాళ్లకు లక్ష్యంగా మారుతున్నారు.

తాజాగా హైదరాబాద్‌ (Hyderabad)సూరారం రాజీవ్‌గాంధీనగర్‌లోని ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ 15 ఏళ్లుగా జీవనం కొనసాగిస్తున్న సిద్దిపేట జిల్లా దుబ్బాక గ్రామానికి చెందిన గొల్లపల్లి విఠల్(Vittal), శాంతమ్మ దంపతులు. ఇంటర్ వరకు చదివి ఒక ప్రైవేట్ కంపెనీలో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్న వీరి చిన్న కొడుకు సందీప్(Sandeep)(20). కొన్ని రోజుల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమై, గొడవల కారణంగా సందీప్‌తో మాట్లాడడం మానేసిన విజయవాడ(Vijayawada)కు చెందిన యువతి. దీంతో మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సందీప్, కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

ehatv

ehatv

Next Story