ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఓ మహిళ సభ్య సమాజం అసహ్యించుకునే ఘటనలో కోర్టు కోడలు-మామకు జీవిత ఖైదు శిక్ష విధించింది.

ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఓ మహిళ సభ్య సమాజం అసహ్యించుకునే ఘటనలో కోర్టు కోడలు-మామకు జీవిత ఖైదు శిక్ష విధించింది. మామ, కోడలు వివాహేతర బంధాన్ని చూసిందని కన్న కూతురును ఇద్దరూ కలిసి హత్య చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం (Khammam)జిల్లాలోని బోనకల్లు(Bonakallu) మండలానికి చెందిన పాలెపు నరసింహారావు అనే వ్యక్తి తన కొడుకు హరికృష్ణ(Harikrishna)కు, సునీత (Sunitha )అనే మహిళతో వివాహం జరిపించాడు.
కొన్నాళ్ల తర్వాత ఈ దంపతులు ఓ ఆడ బిడ్డకు జన్మనిచ్చారు. కూతురుకు 12 ఏళ్లు వచ్చాయి. అయితే గత కొన్నాళ్లుగా ఆమె తల్లి సునీత, తన మామ నరసింహరావుతో వివాహేతర సబంధం ఏర్పర్చుకొని ఇద్దరూ రాసలీలల్లో మునిగిపోయేవారు. ఈ క్రమంలోనే తన భర్త హరికృష్ణ ఇంట్లో లేని సమయంలో సునీత, తన మామతో రాసలీలల ఉదంతాన్ని ఆమె 12 ఏళ్ల కూతురు చూసింది. కూతురు తమను చూడడాన్ని తల్లి, ఆమె మామ గమనించారు. తమ సంబంధం గురించి ఎక్కడ బయటపెడుతుందోనని భయపడిపోయారు. ఈ క్రమంలోనే తన కుమార్తెను హత్య చేసేందుకు సునీత తన మామాతో కలిసి ప్లాన్ వేసింది. పథకం ప్రకారం ఇంట్లో బాలిక నిద్రిస్తున్న సమయంలో తన మామతో కలిసి సునీత ఇంట్లోకి వచ్చింది. నిద్రిస్తున్న బాలిక కాళ్లు, చేతులు కట్టేసి వైరుతో గొంతు బిగించి హతమార్చింది.
ఈ నెపం తమ మీదకు రాకుండా ఉండేందుకు బాలికకు ఫిట్స్ వచ్చిన పడిపోయినట్టు నాటకం ఆడారు. బాలికను వెంటనే స్థానిక హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు ఖమ్మం తరలించాలని చెప్పడంతో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అక్కడ బాలికను పరీక్షించిన వైద్యులు చనిపోయినట్టు నిర్ధారించారు. అయితే బాలిక మృతదేహానికి పోస్ట్‌మార్టం చేయొద్దని సునీత, ఆమె మామ వైద్యులను కోరారు. దీంతో వైద్యులకు అనుమానం వచ్చింది. పోలీసులకు వైద్యులు సమాచారం అందించారు.వెంటనే హాస్పిటల్‌కు చేరుకున్న నాటి ఎస్‌ఐ కవిత ఘటనపై అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పోలీసుల విచారణలో మామ-కోడలి రంకు వ్యవహారం బయటపడింది. ఈ కేసులో మామ-కోడలుకు జీవిత ఖైదు విధించారు.
