వివాహం అయిన తర్వాత మూడు నెలలకే నవ వధువు ఆత్మహత్య చేసుకున్న సంఘటన కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది.

వివాహం అయిన తర్వాత మూడు నెలలకే నవ వధువు ఆత్మహత్య చేసుకున్న సంఘటన కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం... మూసాపేట యాదవ బస్తీలో నివాసముండే సూరవరపు రమ్య (18)కు మూడు నెలల క్రితం అశోక్‌ అనే వ్యక్తితో వివాహం జరిగింది. వివాహం జరిగినప్పటి నుంచి కూతురు, అల్లుడు అత్తింట్లోనే ఉంటున్నారు. సోమవారం రాత్రి అందరు కలిసి భోజనం చేసిన అనంతరం..రమ్య ముందుగా తన రూమ్‌కు వెళ్లి ఫ్యాన్‌ రాడ్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భర్త భోజనం ముగించి రూముకు వెళ్లగా డోర్‌ తెరుచుకోలేదు. దీంతో అందరూ కలిసి తలుపులు తెరవగా రమ్య ఫ్యాన్‌కు ఉరివేసుకొని వేలాడుతూ కనిపించింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కూకట్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ehatv

ehatv

Next Story