కాకినాడ జిల్లా తునిలో కామాంధుడైన టీడీపీ నాయకుడి కీచక పర్వం వెలుగులోకి వచ్చింది.

కాకినాడ జిల్లా తునిలో కామాంధుడైన టీడీపీ నాయకుడి కీచక పర్వం వెలుగులోకి వచ్చింది. ఓ మైనర్‌ బాలిక పట్ల సదరు టీడీపీ నేత అసభ్యకర​ంగా ప్రవర్తించాడు. ఆయన బాగోతాన్ని గుర్తించిన స్థానికులు బాలికను రక్షించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం లేపింది. వివరాల్లోకి వెళ్తే.. తునిలో టీడీపీ నాయకుడు తాటిక నారాయణరావు అకృత్యాలు బయటకు వచ్చాయి. తుని రూరల్‌ గురుకుల పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న మైనర్‌ పట్ల నారాయణరావు అసభ్యకరంగా ప్రవర్తించాడు. మైనర్‌ బాలికను హస్టల్ నుంచి తీసుకుని వెళ్ళి హంసవరం సపోటా తోటల్లో ఆమెను నారాయణరావు లైంగికంగా వేధించాడు. ఇంతలో నారాయణరావు బాగోతాన్ని గుర్తించిన స్థానికులు.. వెంటనే స్పందించి మైనర్‌ను రక్షించారు. ఈ క్రమంలో నారాయణ రావు ప్రశ్నించగా.. ఆమెను మూత్ర విసర్జన కోసం అక్కడికి తీసుకువచ్చానని బుకాయించాడు. అంతటితో ఆగకుండా తాను టీడీపీ కౌన్సిలర్‌ను అంటూ.. తను ప్రశ్నిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బెదిరింపులకు దిగాడు. అయితే, హాస్టల్ నుండి మైనర్‌ను నారాయణరావు బయటకు తీసుకువెళ్లడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Updated On
ehatv

ehatv

Next Story