Parents Killed by Girl: రాజు వెడ్స్ రాంబాయి సినిమా లెవల్లో నాటకం.. కాకపోతే సీన్ రివర్స్..!

వికారాబాద్ జిల్లా బంట్వారం మండలం యాచారం గ్రామంలో జరిగిన విషాద ఘటన స్థానికంగా కలచివేసింది. ఆర్థిక ఇబ్బందులు తాళలేక భార్యాభర్తలు ఆత్మహత్య(Suicide)కు పాల్పడిన ఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నక్కలి దశరథం (58), ఆయన భార్య లక్ష్మి (54) అప్పుల భారంతో తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతూ ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు సమాచారం. ఇది ఇప్పటి వరకు మనకున్న సమాచారం.

తమ ప్రేమకు ఒప్పుకోరన్న ఉద్దేశంతో తల్లి తండ్రులకు ఇంజెక్షన్ ఇచ్చి చిన్న కూతురు సురేఖ చంపింది. ఇంస్టాగ్రామ్ లో పరిచయం అయిన యువకుడి ప్రేమ ఒప్పుకోరు అంటూ ఇంజెక్షన్ ఇచ్చి ఆత్మహత్య చేసుకున్నారు అంటూ డ్రామా క్రియేట్ చేసిన సురేఖ. ప్రేమ వివాహానికి అడ్డువస్తున్నారని కన్న తల్లిదండ్రులను కూతురే కిరాతకంగా హత్య చేసింది. నర్సుగా పనిచేస్తున్న సురేఖ.. తల్లిదండ్రులకు మత్తు ఇంజక్షన్ ఇచ్చి చంపి, ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. పోలీసుల విచారణలో అసలు నిజం బయటపడటంతో ఆమె కటకటాల పాలైంది. వికారాబాద్ జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

సురేఖకు ఏడాది క్రితం ఇన్‌స్టాలో ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. ఇంట్లో విషయం తెలియడంతో ప్రేమ వ్యవహారం తల్లిదండ్రులకు ఇష్టం లేదని చెప్పారు. ఆ మాటతో సురేఖ కోపం పెంచుకుంది. తమ ప్రేమకు అడ్డుగా ఉన్నారన్న కక్షతో తన వృత్తిని అడ్డుపెట్టుకుంది. తల్లిదండ్రులను అడ్డుతొలగించుకోవాలని స్కెచ్ వేసింది. కెటామైన్ అనే మత్తు మందును ఇంజక్షన్ రూపంలో తల్లిదండ్రులకు ఇచ్చింది. కీళ్ల నొప్పులకు ఇంజక్షన్ ఇస్తున్నానని చెప్పి.. హై డోస్ మత్తుమందు శరీరంలోకి ఎక్కించటంతో వారు స్పృహ కోల్పోయి మరణించారు.

Updated On
ehatv

ehatv

Next Story