తమ ప్రేమకు అడ్డుగా ఉన్నాడని ప్రేమికుడితో కలిసి భర్తను చంపి, మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చిన భార్య.

తమ ప్రేమకు అడ్డుగా ఉన్నాడని ప్రేమికుడితో కలిసి భర్తను చంపి, మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చిన భార్య.మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలం షమ్నాపూర్ గ్రామానికి చెందిన శ్రీను భార్య లత, అదే గ్రామానికి చెందిన మల్లేష్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.అనేక సార్లు పెద్దమనుషుల సమక్షంలో పంచాయతీ నిర్వహించి నచ్చజెప్పినా, పద్ధతి మార్చుకోని లత.ప్రియుడితో కలిసి తన భర్త అడ్డును తొలిగించాలని, అదే గ్రామానికి చెందిన మలిశెట్టి మోహన్ అనే వ్యక్తికి రూ.50 వేలు ఇచ్చి భర్తను హతమార్చమని చెప్పిన లత .పథకం ప్రకారం ఈ నెల 16న మద్యం సేవిద్దామంటూ శ్రీనుని అనంతసాగర్ గ్రామ శివారులోకి తీసుకెళ్లి బీరు సీసాతో తలపై కొట్టి హత్య చేసిన మోహన్ .ఈ నెల 28వ తేదీన తన భర్త కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది లత.పోలీసులు విచారణ చేస్తుండగా, అనుమానంతో నిలదీయగా తామే హత్య చేశామని అంగీకరించిన లత ఆమె ప్రియుడు మల్లేష్.
