సామాజిక మాధ్యమాల్లో పరిచయాలు ఏర్పడి, అవి కాస్త వివాహేతర సంబంధాలకు వరకు వెళ్లి, అక్కడి నుంచి భర్తలను చంపే ట్రెండ్ ఈరోజుల్లో మరీ ఎక్కువైంది.

సామాజిక మాధ్యమాల్లో పరిచయాలు ఏర్పడి, అవి కాస్త వివాహేతర సంబంధాలకు వరకు వెళ్లి, అక్కడి నుంచి భర్తలను చంపే ట్రెండ్ ఈరోజుల్లో మరీ ఎక్కువైంది. సోషల్ మీడియాలో ఏర్పడ్డ పరిచయాలు కాస్తా వివాహేతర సంబంధాలతో పచ్చని కాపురాలు చిద్రమవుతున్నాయి. అలాంటి ఘటనే మహబూబాబాద్ జిల్లా గడ్డి గూడెం గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రసాద్ -రష్మితకు ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి సంవత్సరం వయసున్న బాబు ఉన్నాడు. ఆరు నెలల క్రితం రష్మితకు ఇన్స్టాగ్రామ్లో అనిల్ అనే యువకుడు పరిచయం అయ్యాడు. ఆ పరిచయం అక్కడి వరకు వెళ్లింది. అంటే వివాహేతర సంబంధానికి దారి తీసింది. భర్త అడ్డు ఎలాగైనా తొలగించుకోవాలనుకొని ఆదివారం అర్ధరాత్రి ప్రియుడికి ఫోన్ చేసి ఇంటికి పిలిపించుకొని.. భర్తను అదిమిపట్టగా ప్రియుడు పదునైన కత్తితో అటాక్ చేశాడు. ఎలాగో అలాగు వారి నుంచి తప్పించుకున్న భర్త ప్రసాద్ కాపాడండి.. కాపాడండి అంటూ బిగ్గరగా కేకలు వేయడంతో తేరుకున్న స్థానికులు ప్రియుడు అనిల్ని పట్టుకొని దేహాశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. భర్త చెవి, ఛాతీ, కాలికు బలమైన గాయాలు అయ్యాయి. దీంతో ప్రసాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రియుడి కోసం భార్య ఎంతకు తెగించిందని స్థానికులు చర్చించుకున్నారు
