ప్రియుడితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళ భర్తను అడ్డు తొలగించుకోవాలనుకుంది.

ప్రియుడితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళ భర్తను అడ్డు తొలగించుకోవాలనుకుంది. దీంతో భర్తను హతమార్చిన ఘటన సరూర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం..నాగర్‌కర్నూల్‌ జిల్లా ఊరుకొండ మండలం మాదారం గ్రామానికి చెందిన జెల్లెల శేఖర్‌ (40) భార్య చిట్టితో కలిసి దిల్‌సుఖ్‌నగర్‌ కోదండరాంనగర్‌ కాలనీ రోడ్‌ నంబర్‌–7లో ఉంటున్నాడు. 16 ఏళ్లక్రితం వీరికి వివాహం కాగా ఓ కొడుకు, కూతురు ఉన్నారు. శేఖర్‌ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం చిట్టి 100కు డయల్‌ చేసి తన భర్త నిద్రలో చనిపోయాడని సమాచారం ఇవ్వగా ఇన్‌స్పెక్టర్‌ సైదిరెడ్డి తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించగా పెదాలపై గాయాలు ఉండటంతో అనుమానం వచ్చి తమదైన శైలిలో విచారించగా ప్రియుడితో కలిసి హతమార్చినట్లు ఒప్పకుంది. స్థానికంగా ఉండే హరీష్‌తో చిట్టి వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో శేఖర్‌ పలుమార్లు మందలించాడు. ఎలాగైనా భర్త అడ్డుతొలగించుకోవాలకున్నారు. గురువారం రాత్రి శేఖర్‌ నిద్రించిన తర్వాత హరీష్‌ గొంతుపట్టుకోగా డంబెల్స్‌తో చిట్టి దాడి చేసి హతమార్చినట్లు సమాచారం.

ehatv

ehatv

Next Story