కార్తీకమాస స్నాన మహిమ

జనక మహరాజా కార్తీక మాస మునయే ఒక్క చిన్న దానము చేసిననూ, అది గొప్ప ప్రభా వము గలదై వారికి సకలైశ్వర్య ములు కలుగుటయేగాక మరణానంతరము శివసాన్నిధ్యమును చేరు దురు. కానీ , కొంత మంది ఆస్థిరములైన భోగ భాగ్యములు విడువలేక, కార్తీక స్నానములు చేయక, అవినీతి పరులై భ్రష్టులై సంచరించి కడకు క్షుద్రజన్మలు అనగా కోడి, కుక్క, పిల్లిగా జన్మింతురు. అధమము కార్తీక మాస శుక్ల పార్ణమిరోజు అయి ననూస్నాన దాన జప తపాదులు చేయక పోవుట వలన ననేక చండాలాది జన్మ లెత్తి కడకు బ్రహ్మ రాక్షసిగా పుట్టెదరు. దీనిని గురుంచి నాకు తెలిసిన యితి హాస మొకటి విని పించెదను. సపరి వార ముగా శ్రద్దగా ఆల కింపుము.

ఈ భారత ఖండ మందలి దక్షిణ ప్రాంత మున ఒకానొక గ్రామ ములో మహా విద్వాంసుడు, తపశాలి, జ్ఞానశాలి, సత్య వ్యాక్య పరిపాలకుడు అగుతత్వనిష్టుడు అను బ్రాహ్మణుడొక డుండెను. ఒక నాడా బ్రాహ్మ ణుడు తీర్ధ యాత్రాసక్తుడై అఖండ గోదావరికి బయలు దేరును.ఆ తీర్ధ సమీప మున ఒక మహా వట వృక్షంబుపై భయంకర ముఖ ములతోను, దీర్ఘ కేశములతోను, బలిష్టంబు లైనకోరలతోను, నల్లని బాన పొట్టల తోను, చూచు వారుకి అతి భయంకర రూపములతో ముగ్గురు బ్రహ్మ రాక్షసులు నివసించుచూ, ఆదారిన పోవు బాటసారులను బెదిరించి వారిని భక్షించుచు ఆ ప్రాంత మంతయు భయకంపి తము చెయుచుండిరి. తీర్ధయాత్రకై బయలుదేరి అఖండ గోదావరి పుణ్యక్షేత్ర మున పితృ దేవతలకు పిండ ప్రదానము చేయు టకు వచ్చు చున్న విప్రుడు అ వృక్షము చెంతకు చేరు సరికి యథా ప్రకా రము బ్రహ్మ రాక్ష సులు క్రిందకు దిగి అతనిని చంప బోవు సమయమున , బ్రాహ్మ ణుడు ఆ భయంకర రూపములను చూచి గజ గజ వణుకుచూ యేమియు తోచక నారాయణ స్తోత్రం భిగ్గరగా పటించుచు ప్రభో ఆర్త త్రాణ పరాయణ, అనాధ రక్షక , ఆపధలో నున్న గజేంద్రుని , నిండుసభలో అవమానాల పాలగుచున్న మహా సాద్వి ద్రౌపదిని ,బాలుడగు ప్రహ్లాదుని రక్షించిన విధముగానే ఈ పిశాచములు బారి నుండి నన్ను రక్షించు తండ్రీ అని వేడుకొనగా, ఆప్రార్ధనలు విన్న బ్రహ్మరాక్షసులకు జ్ఞానో దయం కలిగి మహానుభావా మీ నోటి నుండి వచ్చిన శ్రీమన్నారాయణ స్తుతి విని మాకు జ్ఞానోదయం అయినది మమ్ము రక్షింపుడుయని ప్రాదేయ పడిరి. వారి మాటలకూ విప్రుడు ధైర్యం తెచ్చుకొని ఓయీ మీరెవరు. ఎందులకు మీకి రాక్షస రూపంబులు కలిగెను. మీ వృత్తాంతము తెలుపుడు అని పలుకగా వారు విప్రపుంగవా మీరు పూజ్యులు, ధర్మాత్ములు,వ్రతనిష్టాపరులు, మీ దర్శన భాగ్యం వలన మాకు పూర్వ జన్మ మందలి కొంత జ్ఞానము కలిగినది. ఇక నుండి మీకు మావలన యేఆపద కలగదని అభయమిచ్చి, అందొక బ్రహ్మరాక్షసుడు తన వృత్తాం తము ఈవిధముగా చెప్ప సాగెను. నాది ద్రావిడ దేశం, బ్రహ్మను డను.

నేను మహా పండితుడనని గర్వముగల వాడినై యుంటిని. న్యాయా న్యాయ విచాక్షణలు మానిపసువునై ప్రవర్తిం చితిని. బాట సారుల వద్ద , అమాయకపు గ్రామస్తుల వద్ద దౌర్జన్యంగా దానం లాగు కోనుచు,దుర్వ్య సనాలతో భార్య పుత్రాదు లను సుఖ పెట్టక , పండితులను అవమాన పరచుచు , లుబ్దు డనై లోక కంటకు డిగ నుంటిని.ట్లుండగా ఒకానొక పండి తుడు కార్తీక మాస వ్రత మును యథా విధిగా నాచ రించి భూత తృప్తి కొరకు బ్రాహ్మణ సమ ర్ధన చేయు తలం పుతో పదార్ధ సంపాదన నిమి త్తము దగ్గరున్న నగర మునకు బయలు దేరి తిరుగు ప్రయాణ ములో మా ఇంటికి అతి థిగా వచ్చేను.వచ్చిన పండి తుని నేను దూషించి , కొట్టి అతని వద్ద ఉన్న ధనము వస్తువులు తీసు కోని ఇంటి నుండి గెంటి వేచితిని. అందులకు విప్రునకు కోపము వచ్చి ఓరి నీచుడా అన్యా క్రాంత ముగ డబ్బు కూడా బెట్టి నది చాలక ,మంచి చెడ్డలు తెలి యక,తోటి బ్రాహ్మణు డని గూడా ఆలోచిం చక కొట్టి తిట్టి వస్తు సామాగ్రిని దోచు కొంటివి, నివు రాక్షసు డవై,నర భక్షకు డవై నిర్మానుష్య ప్రేదేశము లలో నుందువు గాక అని శపించ టచే నాకీ రాక్షస రూపము కలిగినది. బ్రహ్మ స్త్రము నైన తప్పించు కొవ చ్చును కానీ బ్రాహ్మణ శాపమును తప్పించ లేము గదా.కాన నా అపరాదము క్షమింపు మని వారిని ప్రార్దించి తిని. అందుల కతడు దయ తలచి ఓయీ, గోదావరి క్షేత్ర మందొక వట వృక్షము గలదు. దానియందు నివ సించు టచే బ్రాహ్మ ణుడి వలన పునర్జన్మ నొందు దువు గాక అని వేడలి పోయాను. ఆనాటి నుండి నేని రాక్షస స్వరూప మున నర భక్షణము చేయు చుంటిని. కాన , ఓ విప్రోతమ,నన్ను నా కుటుంబము వారిని రక్షింపు మని మొదటి రాక్షసుడు తన వృత్తాంత మును జెప్పెను.

ఇక రెండవ రాక్షసుడు ఓ ద్విజోత్త మా నేను కూడా పూర్వ జన్మలో బ్రహ్మణుడనే. నేను నీచుల సహ వాసము చేసి తల్లి తండ్రులను భాదించి వారికీ తిండి పెట్టక మాడ్చి అన్నమో రామ చంద్రా యను నటుల చేసి , వారి యెదు టనే నా బార్య బిడ్డలతో పంచభక్ష్య పర మాన్నము లతో భుజించు చుండేడి వాడను.నేను యెట్టి దాన ధర్మ ములు చేసి ఎరు గను ,నాబంధు వులను కూడా హింసించి వారి ధనం అప హరించి రాక్ష సుని వలె ప్రవర్తిం చితిని.కావున ,నాకీ రాక్షస సత్వము కలిగెను.నన్ని పాప పంకి లము నుండి ఉద్దరింపు ము అని బ్రాహ్మ ణుని పాదము లపై పడి పరి పరి విధ ముల వేడు కొనెను.

మూడవ రాక్షసుడు కూడా తన వృత్తాంత మును యిటుల తెలియ జేసెను. మహాశయా నేనొక సంపన్న కుటుంబ ములో పుట్టిన బ్రహ్మణు డను. నేను విష్ణు ఆలయ ములో అర్చకు నిగా నుంటిని. స్నాన మైనను చేయక, కట్టు బట్ట లతో దేవా లయ ములో తిరుగు చుండేడి వాడను భగ వంతునికి ధూప దీప నైవేద్యము లైనను అర్పిం చక , భక్తులు గొని తేచ్చిన సంభావలను నా వుంపుడు గత్తెకు అంద జేయుచు మద్యం మాంసము సేవిం చుచు పాప కార్యములు చేసి నందున నా మరణాం తరము ఈ రూపము ధరించి తిని ,కావున నన్ను కూడా పాప విముక్తిని కావింపు మని ప్రార్ధించెను. ఓ జనక మహారాజ తపో నిష్టు డగు ఆ విప్రుడు పిశాచ ములు దినాలాపము లాల కించి ఓ బ్రహ్మరాక్ష సులరా భయపడకుడు. మీరు పూర్వజన్మలో చేసిన ఘోర క్రుథ్యంబుల వల్ల మీకీ రూపములు కలిగెను. నా వెంట రండు మీకు విముక్తిని కలిగింతును అని, వారి నోదార్చి తనతో గొనిపోయి ఆ మువ్వురి చేతన విముక్తి సంకల్పము చెప్పుకొని తనే స్వయముగా గోదావరిలో స్నానమాచ రించిన స్నాన పుణ్యఫలమును ముగ్గురు బ్రహ్మ రాక్షసులకు దారపోయగా వారి వారి రాక్షస రూపములు పోయి దివ్య రూపములు ధరించి వైకుంఠమున కేగిరి. కార్తిక మాసములో గోదావరి స్నాన మాచరించి నచో హరి హరాదులు సంతృప్తి నొంది, వారికీ సకలై శ్వర్య ములు ప్రసా దించుదురు. అందువలన , ప్రయత్నించి అయినా సరే కార్తీక స్నానాలను ఆచ రించాలి. ఇట్లు స్కాంద పురాణాంత ర్గత, వశిష్ట ప్రోక్త కార్తిక మహాత్య ముందలి మూడవ అధ్యాయము పారాయణము సమాప్తము.

Updated On
ehatv

ehatv

Next Story