చిన్న పిల్లల్లో కఫం ముక్కు జలుబు, దగ్గు, గొంతు సమస్యలు తగ్గడానికి కొన్ని ఇంటి చిట్కాలు పాటించాలని ఆరోగ్య రంగ నిపుణులు సూచిస్తున్నారు.

చిన్న పిల్లల్లో కఫం ముక్కు జలుబు, దగ్గు, గొంతు సమస్యలు తగ్గడానికి కొన్ని ఇంటి చిట్కాలు పాటించాలని ఆరోగ్య రంగ నిపుణులు సూచిస్తున్నారు. చిన్న పిల్లలు ముఖ్యంగా 5 సంవత్సరాల లోపు సున్నితంగా ఉంటారు. పిల్లలు ఎక్కువ నీరు తాగితే, కఫం సన్నగా అయ్యి సులభంగా బయటకు వస్తుంది. శుభ్రమైన, మరిగించిన చల్లార్చిన తర్వాత నీరు తాగించండి. 6 నెలల కంటే పెద్ద పిల్లలకు గోరువెచ్చని సూప్‌లు కూరగాయలు, చికెన్ సూప్ ఇవ్వండి. ఏడాది పైబడిన పిల్లలకు తేనె 1 టీస్పూన్, రోజుకు 1-2 సార్లు గోరువెచ్చని నీటిలో కలిపి తాపితే గొంతు సమస్యలకు ఉపశమనం కలిగిస్తుంది. 1 ఏడాది కంటే చిన్న పిల్లలకు తేనె ఇవ్వకూడదు. ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ జలుబు వల్ల డీహైడ్రేషన్ ఉంటే డాక్టర్ సలహా తీసుకోవాలి. ఆవిరి పట్టాలి. ఆవిరి ముక్కు, గొంతులోని కఫాన్ని తీస్తుంది. శ్వాస తీసుకోవడం సులభం అవుతుంది. ఒక గిన్నెలో వేడి నీరు తీసుకోండి.

పిల్లవాడిని ఆ గిన్నె దగ్గర కూర్చోబెట్టి, ఆవిరి పీల్చేలా చేయండి. తల మీద టవల్ కప్పితే ఆవిరి బాగా పనిచేస్తుంది. 5-10 నిమిషాలు, రోజుకు 2-3 సార్లు చేయాలి. 6 నెలల కంటే చిన్న పిల్లలకు ఆవిరి ఇవ్వకుండా డాక్టర్‌ని అడగండి.

ముక్కులో కఫం చేరితే శ్వాస ఇబ్బంది అవుతుంది, సెలైన్ డ్రాప్స్ 0.9% సోడియం క్లోరైడ్ ఉపయోగించాలి. ప్రతి ముక్కు రంధ్రంలో 2-3 చుక్కలు వేసి, 1-2 నిమిషాలు వేచి ఉండండి. ఇది కఫం బయటకు వెళ్లేలా చేస్తుంది.

తులసి టీ: ఏడాది పైబడిన పిల్లలకు, 2-3 తులసి ఆకులను గోరువెచ్చని నీటిలో మరిగించి, చల్లార్చి, కొద్దిగా తేనె కలిపి ఇవ్వండి. రోజుకు 1-2 సార్లు, 2-3 టీస్పూన్లు ఇస్తే చాలు.

అల్లం: చిన్న ముక్క అల్లం రసం తేనెతో కలిపి ఏడాది పైబడిన పిల్లలకు ఇవ్వొచ్చు.

వెచ్చని పాలు: ఏడాది పైబడిన పిల్లలకు, పాలలో చిటికెడు పసుపు కలిపి ఇవ్వండి. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

కఫం సాధారణంగా వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది, యాంటీబయాటిక్స్ అవసరం లేదు. డాక్టర్ సిఫారసు చేస్తే తప్ప వాడకూడదని సూచిస్తున్నారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, గురక లేదా వేగంగా శ్వాస తీసుకోవడం, కఫంలో రక్తం, లేదా ఆకుపచ్చ/పసుపు రంగు కఫం 3 రోజులకు మించి వస్తే డాక్టర్‌ను సంప్రదించాలు. పిల్లవాడు బలహీనంగా, ఆహారం తీసుకోకపోతే, లేదా నిరంతరం ఏడుస్తున్నా, 5 రోజుల తర్వాత కఫం తగ్గకపోతే డాక్టర్‌ను సంప్రదించాలి.

ehatv

ehatv

Next Story