Bone Glue : ఎముకల ఫ్రాక్చర్లను 3 నిమిషాల్లో అతికించే 'బోన్ గ్లూ'
చైనా శాస్త్రవేత్తలు ఇటీవల 'బోన్-02' అనే విప్లవాత్మక బోన్ గ్లూను అభివృద్ధి చేశారు.

చైనా శాస్త్రవేత్తలు ఇటీవల 'బోన్-02' అనే విప్లవాత్మక బోన్ గ్లూను అభివృద్ధి చేశారు. ఇది ఎముకల ఫ్రాక్చర్లను (విరిగిన ఎముకలు) కేవలం 2-3 నిమిషాల్లోనే మరమ్మతు చేయగలదు. ఆల్చిప్పల సహజ అతుకునే సామర్థ్యాన్ని ప్రేరణగా తీసుకుని డిజైన్ చేసిన ఈ బయోఅబ్సార్బబుల్ (శరీరం సహజంగా గ్రహించుకునే) అడ్హెసివ్, రక్తం ఎక్కువగా ఉండే పరిస్థితుల్లో కూడా సమర్థవంతంగా పనిచేస్తుంది.ఇది ఎముకల ముక్కలను 2-3 నిమిషాల్లో బలంగా అతుకుంటుంది. సాధారణ శస్త్రచికిత్సల్లో స్టీల్ ప్లేట్లు, స్క్రూలు వాడటానికి పెద్ద కట్ చేయాల్సి వస్తుంది, కానీ ఈ గ్లూతో 180 సెకన్లలోపు పూర్తి అవుతుంది. బాధిత ఎముకలు 400 పౌండ్ల (సుమారు 181 కేజీలు) బలాన్ని తట్టుకుంటాయి. షియర్ స్ట్రెంగ్త్ 0.5 MPa, కంప్రెసివ్ స్ట్రెంగ్త్ 10 MPa ఉంటుంది, ఇది మెటల్ ఇంప్లాంట్లకు సమానం. శరీరం ఎముక మరమ్మతు అయ్యాక ఈ గ్లూ సహజంగా కరిగిపోతుంది. అంటే, మెటల్ ఇంప్లాంట్లు తొలగించడానికి మరో సర్జరీ అవసరం లేదు. ఇన్ఫెక్షన్, రిజెక్షన్ ప్రమాదాలు తగ్గుతాయి. ఇప్పటివరకు 150 మందికి పైగా రోగులపై టెస్ట్ చేశారు. జెజియాంగ్ ప్రావిన్స్‌లోని సర్ రన్ రన్ షా హాస్పిటల్‌లో డాక్టర్ లిన్ జియాన్‌ఫెంగ్ టీమ్ ఈ పరిశోధన చేసింది.
