Lottery: 2 డాలర్ల లాటరీ టికెట్.. రూ.16,153 కోట్ల జాక్ పాట్..!
Lottery: 2 dollar lottery ticket.. Rs.16,153 crore jackpot..!
అమెరికాలోని పవర్‌బాల్ లాటరీలో ఓ వ్యక్తికి అదృష్టం వరించింది. క్రిస్మస్ రోజున జరిగిన డ్రాలో ఏకంగా $1.8B అంటే దాదాపు రూ.16,153 కోట్లు జాక్‌పాట్ తగిలింది. ఈ లాటరీలో ఒక సారి డబ్బులు ఎవరికీ దక్కకపోతే ఆ మొత్తం తరువాత టికెట్లకు యాడ్ అవుతుంది. దీంతో విన్నర్‌లకు అందే సొమ్ము భారీగా పెరుగుతుంది. గత 3 నెలలుగా ఎవరికీ దక్కని జాక్‌పాట్ ఓ వ్యక్తికి దక్కింది. కేవలం 2 డాలర్ల టికెట్ జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. వివరాల్లోకి వెళ్తే.. అమెరికాలోని పవర్‌బాల్ లాటరీలో జరిగిన డ్రాలో ఆర్కాన్సాస్ రాష్ట్రంలో ఒకే ఒక టికెట్‌కు $1.817 బిలియన్ (సుమారు $1.8 బిలియన్) జాక్‌పాట్ తగిలింది. ఆర్కాన్సాస్‌లోని కాబోట్ పట్టణంలోని ఒక గ్యాస్ స్టేషన్‌లో అమ్మినది. జాక్‌పాట్ మొత్తం $1.817 బిలియన్, అమెరికా చరిత్రలో రెండవ అతిపెద్ద లాటరీ జాక్‌పాట్. ఇది 2025లో పవర్‌బాల్‌లో అతిపెద్ద జాక్‌పాట్, మొత్తం 47 డ్రాలు రోల్‌ఓవర్ అయిన తర్వాత వచ్చింది. విజేత ఇంకా పబ్లిక్‌గా గుర్తించబడలేదు.