Trump declared: వెనెజువెలా అధ్యక్షుడిగా ప్రకటించుకున్న ట్రంప్..!
Trump declared: వెనెజువెలా అధ్యక్షుడిగా ప్రకటించుకున్న ట్రంప్..!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన విడుదల చేశాడు. వెనెజువెలాకు తాత్కాలిక అధ్యక్షుడిగా తనకు తాను ప్రకటించుకున్నారు. ఈ మేరకు తన సోషల్ మీడియా అకౌంట్‌లో స్వయంగా ఆయన ఒక పోస్ట్ చేశారు. ప్రపంచ చరిత్రలోనే ఇలాంటిది మొట్టమొదటిది కావడం గమనార్హం.
డ్రగ్స్ అభియోగాలతో కూడిన నేరాలకుగానూ.. వెనెజువెలా రాజధాని కారకస్‌పై అమెరికా సైనిక చర్యకు పాల్పడింది. జనవరి 3వ తేదీన రాజధాని నగరంపై మెరుపు దాడులు జరిపి.. ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన సతీమణి సిలియా ఫ్లోరస్‌లను బంధించి న్యూయార్క్‌కు తీసుకెళ్లింది. సుమారు 150 యుద్ధ విమానాలతో అమెరికా వెనెజువెలాపై నిర్వహించిన భారీ ఆపరేషన్‌లో 40 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈదాడులను పలు దేశాలు కూడా తీవ్రంగా ఖండించాయి.
మదురో అక్రమ అరెస్ట్ తర్వాత వెనెజువెలా అధ్యక్ష స్థానంలో.. ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్‌ను వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలిగా కూర్చోబెట్టింది ఆ దేశ సుప్రీం కోర్టు. అయితే.. వెనెజువెలాలో తమ ప్రభుత్వమే ఉంటుందని ఆ సమయంలో ట్రంప్ ప్రకటించారు. ఈ ప్రకటనపై విమర్శలు రావడంతో.. వెనెజువెలాలో స్థిర ప్రభుత్వం కొలువుదీరేంత దాకా పర్యవేక్షణ మాత్రమే ఉంటుందని మరో ప్రకటన చేశారు. ఇప్పటికే వెనెజువెలా చమురుపై సర్వహక్కులు తమవేనని.. ఏ దేశమైనా తమతోనే డీల్ కుదుర్చుకోవాలని ట్రంప్ అల్టిమేటం జారీ చేశారు. అంతర్జాతీయ ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. తాత్కాలిక అధ్యక్షుడినంటూ ట్రంప్ చేసిన తాజా ప్రకటన తీవ్ర చర్చనీయాంశమైంది.


