ఇంటి ఆడబిడ్డపై పెయిడ్ ఆర్టిస్టులతో మాట్లడిస్తున్నారు, నా జోలికొస్తే బాగోదు, కేసీఆర్ ను మేమే నడిపిస్తున్నామని కొందరు చెప్పుకుంటున్నారు

ఇంటి ఆడబిడ్డపై పెయిడ్ ఆర్టిస్టులతో మాట్లడిస్తున్నారు, నా జోలికొస్తే బాగోదు, కేసీఆర్ ను మేమే నడిపిస్తున్నామని కొందరు చెప్పుకుంటున్నారు

నా లేఖ లీక్ చేసిందెవరో చెప్పాలి, కేసీఆర్‌కు నోటీసులు ఇస్తే ఎందుకు నిరసనలు తెలపలేదు, ఇంకో నేతకు నోటీసులు ఇస్తే ఎందుకు హంగామా చేశారు, పార్టీ చేయాల్సిన పనులు జాగృతి తరుపున నేనే చేస్తున్నా, బిఆర్‌ఎస్‌ను బీజెపి(BJP)లో విలీనం చేసే కుట్ర జరుగుతోంది, నామీద పడి ఏడిస్తే ఏమోస్తుంది, కాంగ్రెస్(Congress) మునిగిపోయే నావ, ఆ పార్టీతో రాయబారాలు నాకెందుకు, నాపై తప్పుడు వార్తలను పార్టీ ఎందుకు ఖండించడంలేదు. బీఆర్ఎస్‌(BRS)లో కేసీఆర్ తప్ప ఇంకెవరీ నాయకత్వం అంగీకరించను, నాది బిఆర్‌ఎస్ పార్టీ, నేను జైలులో ఉన్నప్పుడే నాపై కుట్ర జరిగింది, జైలుకు వెళ్లేటప్పుడు పార్టీకి రాజీనామా చేస్తానని చెప్పా, కేసీఆర్‌ (KCR)అందుకు అంగీకరించలేదు, పార్టీ సోషల్ మీడియాలో నన్ను టార్గెట్ చేశారు. నేను రాసిన లేఖను బయటపెట్టిందెవరు, నాకు వెన్నుపోటు రాజకీయాలు తెలియవు, పార్టీని నడిపించే తీరు ఇదేనా, వరంగల్‌ సభ సక్సెస్‌ మా వల్లేనని కొందరు చెప్పుకుంటుంటే నవ్వుతున్నారు, ఇతర దేశాల నుంచి సోషల్‌ మీడియాలో నాపై దాడులు చేస్తున్నారు, నేను కేసీఆర్‌లాగే తిక్కదాన్ని, ఎవరికీ భయపడను, మీ తెలివితేటలు ప్రతిపక్ష పార్టీలపై చూపించాలి, నాపై ఆరోపణలు వచ్చినప్పుడు ఎమ్మెల్సీకి రాజీనామా చేస్తానన్నా, రాజీనామా వద్దని కేసీఆర్‌ అన్నారు, లేఖ ఎందుకు రాశావంటున్నారు, ఒక్కటి కాదు వంద లేఖలు రాశా, పార్టీని నడిపించే సత్తా లేదు, నాకే నీతులు చెప్తారా'' అంటూ పరోక్షంగా కేటీఆర్‌ను విమర్శించారు

ehatv

ehatv

Next Story