Sankranti: 1935-2008 వరకు జనవరి 14న, 2008-2080 వరకు జనవరి 15న, 2081-2153 వరకు జనవరి 16న..! ఎందుకిలా..!

Sankranti: 1935-2008 వరకు జనవరి 14న, 2008-2080 వరకు జనవరి 15న, 2081-2153 వరకు జనవరి 16న..! ఎందుకిలా..!

By :  ehatv
Update: 2026-01-13 10:19 GMT

సంక్రాంతి పండగ 1935-2008 వరకు జనవరి 14న, 2008-2080 వరకు జనవరి 15న, 2081-2153 వరకు జనవరి 16న.. ఎందుకిలా మారుతుంది. 2008వ సంవత్సరం నుండి సంక్రాంతి పండుగ జనవరి 15న రావడం ప్రారంభమైంది. అంతకుముందు1935 నుండి 2007వరకు జనవరి

14ననే పండుగ వచ్చేది. ఇదో 72 ఏళ్ల సమయం. ప్రతీ 72 సంవత్సరాలకు ఒకసారి పండుగ ఒకరోజు తర్వాతకు మారుతుంది. 1935 నుండి 2007 వరకు జనవరి 14న, 2008 నుండి 2080 వరకు జనవరి 15న, 2081 నుండి 2153 వరకు జనవరి 16న సంక్రాంతి పండుగ వస్తుంది.

ఎందుకిలా అంటే, సాధారణంగా, సూర్యుడు ధనూ రాశి నుండి మకరరాశిలోకి ప్రవేశించిననాడే మకర సంక్రాంతి జరుపుకోవడం ఆనవాయితీ. ఈ రోజు నుండి మిధునరాశికి ప్రవేశించేదాకా ‘ఉత్తరాయణ పుణ్యకాలం’గా వ్యవహరిస్తారు. ఇక, సూర్యుడు ప్రతీసంవత్సరం మకరసంక్రమణం చేసినప్పుడు 20 నిమిషాలు ఆలస్యం అవుతోంది. స్థూల గణన ఆధారంగా ఇది 3 సంవత్సరాలకు ఒక గంట, 72 ఏళ్లకు ఒక రోజుగా మారుతోంది. ఈ లెక్కన, ఇంగ్లీష్‌ క్యాలెండర్‌ ప్రకారం, 72 ఏళ్లకు ఒకసారి సంక్రాంతి తర్వాతి రోజుకు మారుతుంది. జనవరి 16న సంక్రాంతి రావడం మొదలవుతుంది

Tags:    

Similar News