‘దండోరా’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

‘దండోరా’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా హీరోయిన్ల డ్రెస్సింగ్ సెన్స్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి. ఈ ఈవెంట్‌లో మాట్లాడిన శివాజీ, యాంకర్ డ్రెస్సింగ్ సెన్స్ బాగుందని ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...'' దయచేసి ఇంకో విషయం చెబుతున్నా అమ్మాయిలు, హీరోయిన్లు ఏ బట్టలు పడితే అవి వేసుకొని పోతే మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తుంది. అమ్మా ఏమనుకోవద్దు, హీరోయిన్లు అందరూ మీ అందం చీరలోనే, మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది. తప్పితే సామాన్లు కనపడే దాంట్లో ఏం ఉండదు అమ్మ, అవి వేసుకున్నంత మాత్రాన చాలామంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు, కానీ దరిద్రం ము.. డ ఇలాంటి బట్టలు ఎందుకు వేసుకుందని, కాస్త మంచి వేసుకోవచ్చుగా బాగుంటావు కదా అనే అనాలనిపిస్తది లోపల, కానీ అనలేము, అంటే మళ్ళీ స్త్రీ స్వాతంత్రం లేదా, స్వేచ్ఛ లేదు అంటారు. స్త్రీ అంటే ప్రకృతి, ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరిగిద్ది, ఈ ప్రకృతి అద్భుతంగా ఉంటుంది. అలాగే స్త్రీ, మా అమ్మ, చక్కగా ఎప్పటికీ గుండెల్లో కనపడతా ఉంటుంది. ఒక సావిత్రమ్మ గాని, ఒక సౌందర్య గాని చాలా మంది అమ్మాయిలు ఉన్నారు వీళ్ళందరూ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు కాబట్టి, వెంటనే చెప్పగలుగుతున్నాం గ్లామర్ అనేది ఒక దశ వరకే ఉండాలి, ఇంతవరకు ఉంటే పర్వాలేదు, అది ఇక్కడికి రాకూడదు, ఈ మాటలు చెప్తే స్వేచ్ఛ లేదు, స్వేచ్ఛ అనేదే అదృష్టం, ఆ స్వేచ్ఛని కోల్పోవద్దు, మనకు గౌరవం ఎప్పుడు పెరుగుతుంది అంటే, మన వేషం, భాష నుంచే మనకు గౌరవం పెరుగుతుంది. అందులో ప్రపంచ వేదికల మీదైనా సరే చీరకట్టుకున్నోళ్ళకే విశ్వసుందర కిరీటాలు వచ్చాయి. థాంక్యూ థాంక్యూ సో మచ్'' అంటూ ఆయన వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్యలపై సోషల్‌ మీడియాలో డిఫరెంట్‌ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు శివాజీ మాటలకు మద్దతు తెలుపగా, మరికొందరు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ముఖ్యంగా ‘సామాన్లు’, ‘దరిద్రపు’ వంటి పదాలు ఉపయోగించడం సరికాదని, హీరోయిన్ల డ్రెస్సింగ్ సెన్స్‌పై అభిప్రాయం చెప్పాలంటే మర్యాదగా చెప్పొచ్చని పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

Updated On
ehatv

ehatv

Next Story