జగదేక వీరుడు అతిలోక సుందరి (1990) తెలుగు సినిమా చరిత్రలో ఒక ఐకానిక్ సోషియో-ఫాంటసీ చిత్రం.

జగదేక వీరుడు అతిలోక సుందరి (1990) తెలుగు సినిమా చరిత్రలో ఒక ఐకానిక్ సోషియో-ఫాంటసీ చిత్రం. ఈ సినిమా : మే 9, 1990లో విడుదలైంది. కె. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో సి. అశ్వనీ దత్ వైజయంతీ మూవీస్ ద్వారా దీనిని నిర్మించారు. చిరంజీవి, శ్రీదేవి, అమ్రిష్ పురి, కన్నడ ప్రభాకర్, అల్లు రామలింగయ్య, రామిరెడ్డి ఇందులో నటించారు. ఈ సినిమా 1990లో విడుదలై రూ.15 కోట్లు వసూలు చేసి, అప్పటి వరకు అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రంగా రికార్డు సృష్టించింది. 47 కేంద్రాల్లో 50 రోజులు, 29 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. చిరంజీవి(Chiranjeevi), శ్రీదేవి (Sridevi)జంట అద్భుతమైన కెమిస్ట్రీతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. శాలిని, శామిలి వంటి బాల నటులు కూడా కీలక పాత్రలు పోషించారు. నిర్మాత అశ్వనీ దత్ ఎన్.టి.ఆర్(NTR). నటించిన "జగదేక వీరుని కథ" స్ఫూర్తితో ఈ సినిమా తీయాలని కలలు కన్నారు.సినిమా విడుదల సమయంలో వర్షాలు, విద్యుత్ సమస్యల వంటి అడ్డంకులు ఎదురైనప్పటికీ, ప్రేక్షకుల ఆదరణతో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాకు సీక్వెల్ గురించి చర్చలు జరిగినప్పటికీ, శ్రీదేవి మరణం, చిరంజీవి వయస్సు వంటి కారణాలతో అది సాధ్యపడలేదు. కానీ దీనిని సీక్వెల్‌ గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేశారు. సినిమా సీక్వెల్‌ చేస్తే రాంచరణ్‌, జాహ్నవీ కపూర్‌, రాఘవేంద్రరావు పర్యవేక్షణలో నాగ అశ్విన్‌ దర్శకత్వంలో, అశ్వినీదత్‌ కూతుర్లు నిర్మాతగా చేయాలని తాను కోరుకుంటున్నానని చిరంజీవి అన్నారు. ఈ సందర్భంగా రాంచరణ్‌ కూడా ఓ వీడియోలో మాట్లాడుతూ సినిమా క్లైమాక్స్‌లో శ్రీదేవి వేసిన ఉంగరం ఒక చేప మునుగుతుందని, ఇప్పుడు ఆ ఉంగరం ఎక్కడ ఉందని, ఆ చేప ఎక్కడ ఉందని... దీనికి నాగ అశ్వినే సమాధానం చెప్పాలని రాంచరణ్‌ అన్నారు. ఇదేదో సింక్‌ అయిందని.. ''నాగ అశ్విన్‌ బీ-రెడీ'' అని చిరంజీవి చెప్పడం కొసమెరుపు. మే 9న, సినిమా 35వ వార్షికోత్సవం సందర్భంగా 4K, 3D వెర్షన్‌లో తెలుగు రాష్ట్రాల్లో రీ-రిలీజ్ అయింది.

ehatv

ehatv

Next Story