జాన్వీ కపూర్ తన పెళ్లి గురించి ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికరంగా మాట్లాడింది.

జాన్వీ కపూర్ తన పెళ్లి గురించి ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికరంగా మాట్లాడింది. ఆమె తిరుపతిలో సెటిల్ కావాలని, ముగ్గురు పిల్లలతో సింపుల్ లైఫ్ గడపాలని కోరుకుంటుందట. అరటి ఆకులో భోజనం, గోవింద నామం జపిస్తూ, లుంగీ కట్టుకున్న భర్తకు మసాజ్ చేయడం రొమాంటిక్‌గా ఉంటుందని చెప్పింది. ఆమె పెళ్లి ప్లాన్స్‌లో ఇటలీలో బ్యాచిలరెట్ పార్టీ, చెన్నైలో వివాహ వేడుకలు ఉన్నాయట. అయితే, ఈ ప్లాన్స్ గురించి కరణ్ జోహార్‌తో మాట్లాడుతూ జోక్‌గా చెప్పినా, ఆమె సింపుల్ అండ్ ట్రెడిషనల్ లైఫ్‌స్టైల్‌నే ఇష్టపడుతుందని తెలుస్తోంది.
ప్రస్తుతం ఆమె శిఖర్ పహారియాతో రిలేషన్‌లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి, కానీ పెళ్లి గురించి ఇంకా అధికారిక ప్రకటన లేదు.జాన్వీ కపూర్ తిరుమల శ్రీవారి భక్తురాలు. ఆమె తరచూ తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటుంది. తన సినిమాల విడుదల సమదయంలో లేదా ప్రత్యేక సందర్భాల్లో తిరుమలకు వచ్చి స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం ఆమెకు అలవాటు. ఆమె ఇంటర్వ్యూల్లో కూడా తిరుపతిపై తనకున్న భక్తి, శాంతి కోసం అక్కడికి వెళ్లడం గురించి చెప్పింది. తిరుపతిలో సెటిల్ కావాలన్న ఆమె కోరిక కూడా ఈ భక్తికి నిదర్శనం.
