'Singer Chinmayi': పని ఇస్తారు.. సెక్స్ కావాలంటారు.. మెగాస్టార్ వ్యాఖ్యలపై 'సింగర్ చిన్మయి' కౌంటర్..!

మెగాస్టార్ చిరంజీవి నటించిన 'మన శంకరవర ప్రసాద్ గారు'తో మంచి విజయాన్ని అందుకున్నారు. సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అనిల్ రావిపూడి 'మన శంకర వర ప్రసాద్ గారు'తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. దీంతో ఈ సినిమా విజయం సక్సెస్ సెలబ్రేషన్స్ లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. చిత్ర యూనిట్ పై ప్రశంసలు కురిపించిన మెగాస్టార్. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్‌పై కూడా మాట్లాడారు.
సినీ ఇండస్ట్రీలో 'కాస్టింగ్ కౌచ్' అనేది అసలే లేదని, మన పరిశ్రమ అద్దం లాంటిదని చిరంజీవి అన్నారు . ఈ కామెంట్స్ ఇప్పుడు పెద్ద చర్చకు దారితీశాయి. మెగాస్టార్ వ్యాఖ్యలపై సింగర్ చిన్మయి స్పందించారు. కాస్టింగ్ కౌచ్ లేదన్న చిరంజీవి వ్యాఖ్యలతో ఆమె విభేదించారు. ఫిల్మ్ ఇండస్ట్రీ మిర్రర్ లాంటిదని, కాస్టింగ్ కౌచ్ లేదన్న చిరంజీవితో విభేదిస్తున్నట్టు చిన్మయి తెలిపారు. ఈమేరకు ఆమె సోషల్ మీడియాలో ట్వీట్స్ పంచుకున్నారు. అలాగే క్యాస్టింగ్ కౌచ్ గురించి కొన్ని ఉదాహరణలు కూడా ఆమె తెలుపుతూ ట్వీట్స్ షేర్ చేశారు.
కాస్టింగ్ కౌచ్ అనేది అదుపులో లేని సమస్య. కమిట్మెంట్కు నో చెబితే అవకాశాలు ఇవ్వరు. చిరంజీవి జనరేషన్లో మహిళా ఆర్టిస్టులను గౌరవించేవారు. ఇండస్ట్రీ మిర్రర్ లాంటిది కాదు. లిరిసిస్ట్ వైరముత్తు నన్ను వేధించాడు. వేధించమని నేనడగలేదు. అతను నన్ను వేధించేటప్పుడు పక్కనే నా తల్లి కూడా ఉంది. నా తల్లి పక్కనే ఉన్నా మగవారి బుద్ధి మారదు. ఇక్కడ పని ఇచ్చినందుకు బదులుగా సెక్స్ కోరుకుంటారు. అలాంటి పురుషుల ఆలోచనా ధోరణే పెద్ద సమస్య అంటూ ట్విట్ చేశారు చిన్మయి. ఇప్పుడు ఈ కామెంట్స్ వైరల్‌గా మారాయి.
కాస్టింగ్ కౌచ్ అనేది సర్వసాధారణం, మహిళలు కమిట్మెంట్ ఇవ్వకుంటే పాత్రలు తిరస్కరిస్తారు. లెజెండరీ చిరంజీవి గారు ఒక తరం నుండి వచ్చారు, అక్కడ వారందరూ తమ మహిళా సహనటులతో స్నేహితులు లేదా కుటుంబ స్నేహితులుగా ఉండేవారు, ఒకరినొకరు గౌరవించుకునేవారు, లెజెండ్లతో కలిసి పనిచేశారు, వారందరూ స్వయంగా లెజెండ్లే.


