హీరో దగ్గుబాటి రానా తండ్రి కాబోతున్నాడు. త్వరలోనే ఆ కుటంబంలో వారసుడో లేదా వారసురాలో రానున్నారు.

హీరో దగ్గుబాటి రానా తండ్రి కాబోతున్నాడు. త్వరలోనే ఆ కుటంబంలో వారసుడో లేదా వారసురాలో రానున్నారు. రానా భార్య మిహిక కన్సీవ్‌ అయినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని రానా ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. ఓ మంచి రోజు చూసి ఈ గుడ్‌ న్యూస్‌ని దగ్గుబాటి అభిమానులతో పంచుకోవాలని రానా భావిస్తున్నారట. గతంలోనూ మిషికా ప్రెగ్నెంట్‌ అంటూ నెట్టింట ప్రచారం జరిగింది. ఈ వార్తలను రానా దంపతులిద్దరూ కొట్టిపారేశారు. చాలా కాలం తర్వాత మరోసారి రానా తండ్రి కాబోతున్నారనే వార్తలు వచ్చాయి. ఈ సారి కూడా పుకారుగానే మిగిలిపోతుందా? లేదా నిజంగానే రానాకి ప్రమోషన్‌ వచ్చిందా అనేది తెలియాలంటే వాళ్లు స్పందించేవరకు ఆగాల్సిందే.

Updated On
ehatv

ehatv

Next Story