ఒడిశాలోని నువాపడ జిల్లాకు చెందిన 92 ఏళ్ల వృద్ధురాలు మంగల్‌బారి మోహరా(Mangalbari Mahara), కుక్క కాటుకు గురై రేబిస్‌ టీకా (rabies vaccine) కోసం 20 కిలోమీటర్ల దూరం కాలినడకన ప్రయాణించారు.

ఒడిశాలోని నువాపడ జిల్లాకు చెందిన 92 ఏళ్ల వృద్ధురాలు మంగల్‌బారి మోహరా(Mangalbari Mahara), కుక్క కాటుకు గురై రేబిస్‌ టీకా (rabies vaccine) కోసం 20 కిలోమీటర్ల దూరం కాలినడకన ప్రయాణించారు. ఈ హృదయవిదారక ఘటన ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఒడిశా(Odisha)లో ప్రైవేటు వాహనాల డ్రైవర్లు రెండు రోజులుగా సమ్మె చేస్తుండటంతో రాష్ట్రవ్యాప్తంగా రవాణా సేవలు స్తంభించాయి. ఈ సమ్మె నువాపడ జిల్లాలోని సీనాపల్లి సమితికి చెందిన శికబాహల్‌(Sikabahal village) గ్రామ నివాసి మంగల్‌బారి మోహరాకు తీవ్ర ఇబ్బందిగా మారింది.

కొద్ది రోజుల క్రితం మంగల్‌బారిని(Mangalbari Mahara) ఒక కుక్క కరిచింది. దీంతో ఆమె సీనపల్లిలోని కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ (CHC)లో ప్రాథమిక చికిత్స తీసుకున్నారు. వైద్యుల సూచన మేరకు బుధవారం రేబిస్‌ టీకా వేయించుకోవాల్సి ఉంది. అయితే, సమ్మె కారణంగా గ్రామంలో ఎలాంటి రవాణా సౌకర్యం అందుబాటులో లేకపోవడంతో, ఆమె తన గ్రామం నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న సీనాపల్లి వరకు కాలినడకన వెళ్లవలసి వచ్చింది. టీకా వేయించుకున్న తర్వాత, మరో 10 కిలోమీటర్లు నడిచి ఇంటికి తిరిగి చేరుకున్నారు.

ehatv

ehatv

Next Story