పిల్లలకు పాఠాలు చెప్పి సక్రమమార్గంలో పెట్టాల్సిన గురువులే తప్పుదోవపడుతున్నారు.

పిల్లలకు పాఠాలు చెప్పి సక్రమమార్గంలో పెట్టాల్సిన గురువులే తప్పుదోవపడుతున్నారు. చదువుకున్న మూర్ఖుల్లా ప్రవర్తిస్తూ ఉన్నారు. చివరికి మహిళా టీచర్లు కూడా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. గవర్నమెంట్ స్కూల్‌కు చెందిన ఇద్దరు మహిళలు దారుణంగా కొట్టుకున్నారు. జుట్లు పట్టుకుని డబ్ల్యూడబ్ల్యూఈని మించి పోయి ఫైట్ చేశారు. ఈ సంఘటన మధ్య ప్రదేశ్‌లో వెలుగు చూసింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరలైంది. మధ్యప్రదేశ్‌(Madhya Pradesh)లోని ఖర్గోన్ జిల్లా(Khargone)లో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్‌(Ekalavya Model Residential School)లో ప్రిన్సిపాల్ ప్రవీణ్ దహియా(Praveen Dahiya), లైబ్రేరియన్ మధురాణి (Madhurani)మధ్య భౌతిక గొడవ జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీడియోలో ఇద్దరూ ఒకరినొకరు చెంపదెబ్బలు కొట్టుకోవడం, జుట్టు పట్టుకోవడం చూడొచ్చు. ప్రిన్సిపాల్ లైబ్రేరియన్ మొబైల్ ఫోన్‌ను కూడా పగలగొట్టినట్లు తెలుస్తోంది. ఈ గొడవకు కారణం వర్క్‌కు సంబంధించిన విభేదాలు అని ప్రాథమిక విచారణలో తేలింది. ఇద్దరూ ఒకరిపై ఒకరు మైంగావ్ గ్రామంలో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ ఘటన తర్వాత ఇద్దరినీ వారి విధుల నుంచి తొలగించారు. ఏకలవ్య స్కూల్ కేంద్ర ప్రభుత్వ పథకం కింద నడుస్తుంది కాబట్టి, వివరణాత్మక నివేదిక ఢిల్లీ(Delhi)లోని అధికారులకు పంపించారు. అసిస్టెంట్ కమిషనర్ ఆర్య ఈ ఘటనపై విచారించారు. నివేదిక సమర్పించిన తర్వాత కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్య తెలిపారు.

ehatv

ehatv

Next Story