కేంద్ర ప్రభుత్వ ఉద్యో గులకు 4శాతం డిఎ (Dearness Allowance)పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.

కేంద్ర ప్రభుత్వ ఉద్యో గులకు 4శాతం డిఎ (Dearness Allowance)పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఉద్యోగులకు ప్రతిఏటా రెండు పర్యాయాలు డిఎలను పెంచుతుంది. ద్రవ్యోల్బణ తీరుతెన్నులు ఆధారంగా ఏడో వేతన కమిషన్ సిఫారసులను అనుసరించి ఈ డిఎ పెంపు ఉంటుంది. జులై నెల నుంచే ఈ డిఎ ఉద్యోగుల జీతాలకు తోడవుతుంది. అయితే తుది ప్రకటన వెలువడాల్సి ఉంది.పారిశ్రామిక కార్మి కులకు అన్వయించే అఖిలభారత వినియో గరంగ ధరలసూచీ మే నెలలో 0.5 పాయింట్లు పెరిగి 144 కి చేరింది.మూడునెలలుగా సూచీ పెరుగుతూనే ఉంది. మార్చి లో 143, ఏప్రిల్ లో 143.5. మేనెలలో 144 పాయింట్లుగా నమోద యింది. జూన్ లో అయితే ఏకంగా 144.5 పాయింట్లకు చేరింది.12 నెలల సగటు కూడా 144.17 పాయింట్లుగా ఉంది. ఏడో వేతన కమిషన్ నిబంధనను అనుసరించి డిఎ రేటు ప్రస్తుతం 58.85శాతంగా ఉం టుంది.
ప్రభుత్వం ఈ సంఖ్యను 59శాతంగా సవరించే అవకాశం ఉంది. వీటన్నింటి దృష్ట్యా చూస్తే ఈ ఏడాది జులై నుంచి డిఎను కేంద్ర ప్రభుత్వం(Central Government) తమ ఉద్యోగులకు 3 నుంచి 4శాతం మేర పెంచుతుందని అంచనా. ప్రస్తుతం ఉద్యోగులకు 55 శాతం డిఎ ఉంది. తుది నిర్ణయం జూన్నెల ధరలసూచీ ఆధారంగా చేస్తారు. ఈ సూచీ గణాంకాలు ఆగస్టులో విడుదలవుతాయి. ఈ డిఎ పెంపు జులై నుంచి డిసెంబరు వరకూ ఉంటుంది. ఏడోవేతన సంఘం సిఫారసుల మేరకే చేస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. 2014లో ఈకమిషన్ ను ఏర్పా టు చేసారు. కమిషన్ సిఫారసులన్నీ కూడా 2016 జనవరి ఒకటినుంచి అమలులోకి వచ్చాయి.
కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు, ఇతర అన్నిరంగాల వారిని సంప్రదించి ప్రభుత్వానికి తన సిఫారసులు అందచేస్తుంది. కేంద్ర ప్రభుత్వం 8వ వేతనసంఘం సిఫారసులను కూడా ఆమోదించింది. 2025 జనవరినుంచి సిఫార సులు చేసింది. అయితే ఇవి 2026 జనవరి ఒకటినుంచి అమలుకువస్తుంది. డిఎ పెంపును కూడా వాస్తవానికి సెప్టెంబరు లేదా అక్టోబరులో ప్రకటిస్తుంది. ఎందుకంటే ఆరోజులన్నీ పండగ సీజన్ కాబట్టి ఉద్యోగుల ప్రయోజనాల ను దృష్టిలో పెట్టుకుని ప్రకటిస్తుంది. ఈసారి కూడా దీపావళి పండగ సీజన్ ఉన్నందున డిఎ పెంపును ప్రకటించిందని అంచనా.
